హైదరాబాద్ TO కర్ణాటక టూర్.. రూ. 13వేలకే ఆ ప్రదేశాలన్నీ.. సమ్మర్ లో ఫుల్ ఎంజాయ్..
దక్షిణ భారత్ లో కర్ణాటక ఎంతో ప్రాముఖ్యతను చాటుకుంది. కర్ణాటకలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో పిల్లాపాపలతో కలిసి ఏదైనా వెకేషన్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న కర్ణాటకలో ఇప్పుడు తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది రైల్వే శాఖ. కేవలం రూ. 13 వేలతోనే ఆ ప్రదేశాలన్నీ చుట్టి వచ్చే అవకాశం కల్పిస్తోంది. మరి ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
కర్ణాటకలో ప్రముఖ ఆలయాలతోపాటు అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సమ్మర్ సెలవులు కావడంతో తక్కువ ధరకే కర్ణాటక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ. కేవలం రూ. 13 వేలకే ఫ్యామిలీతో కర్ణాటకలోని అనేక టూరిస్టు ప్రాంతాలను చుట్టేసి రావచ్చు. మెమోరీస్ ఆఫ్ మైసూర్ అనే పేరుతో ఐఆర్సీటీసీ ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎన్ని రోజులు ఉంటుంది..? ఏఏ ప్రాంతాలను కవర్ చేయోచ్చు..? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
కర్ణాటక టూర్ లో భాగంగా మొదటిరోజు హైదరాబాద్ లోని కాచిగూడ స్టేషన్ నుంచి రాత్రి 7 గంటలకు రైలు స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత రెండోరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మైసూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఆ తర్వాత టిప్పు సమ్మర్ ప్యాలెస్, శ్రీరంగపట్నం చూస్తారు. సాయంత్రం మైసూర్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. ఇక మూడోరోజు నంజన్ గుడి ఆలయం, సోమనాథ్ పురం టెంపుల్ ను సందర్శిస్తారు. రాత్రికి మైసూర్ లోనే బస ఉంటుంది.

ఇక నాలుగోరోజు బేలూర్ సందర్శన ఉంటుంది. అక్కడ చెన్నకేశవ స్వామి ఆలయం దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత హళేబిడులోని హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక ఐదోరోజు చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మైసూర్ నుంచి రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దాంతో జర్నీ పూర్తి అవుతుంది. ట్రైన్ టికెట్స్ రూ. 13 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 29, మే06, 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి..












Click it and Unblock the Notifications