8 కొత్త రైళ్లు వచ్చేశాయ్. తిరుపతి, జైపూర్ వెళ్లేవారికి ఇక పండగే..

తెలంగాణ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ ఎనిమిది కొత్త రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ నూతన రైళ్లు హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు సర్వీసులు అందించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తుల కోసం తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలకు చర్లపల్లి - కాచిగూడ నుంచి నాలుగు కొత్త రైళ్లను కేటాయించారు. అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం రాజస్థాన్‌లోని జైపూర్, శ్రీ గంగానగర్, ఒడిశాలోని భువనేశ్వర్‌లకు కొత్త సర్వీసులను ప్రారంభించనున్నారు. వీటిలో మెజారిటీ రైళ్లు మే 2026 నుంచే పట్టాలెక్కనున్నాయి.

Indian Railways Announces 8 New Special Trains for Telangana Enhanced Connectivity to Tirupati and Jaipur

కొత్త రైళ్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

కాచిగూడ నుంచి రెండు ప్రధాన రైళ్లు ప్రారంభమవుతున్నాయి.

  • 17607/17608: మే 15 నుంచి ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు తిరుచానూరుకు బయల్దేరుతుంది.
  • 17601/17602: జూలై 14 నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు ప్రయాణిస్తుంది.

కొత్తగా అభివృద్ధి చెందిన చర్లపల్లి టెర్మినల్ నుంచి ఐదు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

  • 17047/17048: మే 7 నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6:55 గంటలకు తిరుచానూరుకు
  • 17441/17442: మే 14 నుంచి ప్రతి బుధవారం రాత్రి 9:20 గంటలకు తిరుపతికి రైళ్లు నడుస్తాయి.
  • 17443/17444: మే 15 నుంచి శుక్రవారం సాయంత్రం 4:20 గంటలకు తిరుపతికి,
  • 17059/17060: మే 11 నుంచి ఆదివారం రాత్రి 9:15 గంటలకు తిరుచానూరుకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
  • 17067/17068: ఒడిశా వెళ్లే వారి కోసం మే 5 నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:10 గంటలకు భువనేశ్వర్ రైలు ప్రారంభం కానుంది.

వీటితో పాటు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు ప్రతి శుక్రవారం రాత్రి 7:50 గంటలకు ఒక కొత్త రైలు (17079/17080) నడపాలని నిర్ణయించారు. ఈ రైలు ప్రారంభ తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ కొత్త రైళ్ల రాకతో వేసవి, పండుగల రద్దీ తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+