ఈ జిల్లాలకు వర్ష సూచన... వరుణుడి రాక సంకేతం పంపిన వాతావరణశాఖ

తెలంగాణలో మే నెల కావడంతో ఎండలు మండుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో వర్షాలు పడతాయి అన్న వాతావరణ శాఖ అంచనాలు ఎండలతో బెంబేలెత్తి పోతున్న ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈరోజు మరియు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు

ముఖ్యంగా ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెంలో 5.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే, వర్షాలు కొన్ని చోట్ల పడుతున్నా, ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఎండలు తీవ్రతరం కావడంతో శుక్రవారం వడదెబ్బ కారణంగా ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Rains alert for telangana The Meteorological Department has stated that there are indications of rains

గాలిలో తేమ తగ్గుదల.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త

ప్రస్తుతం గాలిలో తేమ శాతం బాగా తగ్గి 22-35 శాతాల మధ్య ఉండటం వాతావరణ నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా 50-60 శాతం తేమ ఉండాల్సిన సమయంలో ఇది చాలా తక్కువ. తేమ తగ్గడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా శరీరానికి తగిలే వేడి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చర్మ సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరుగుతున్నాయి.

ఈ కారణాలతో వాతావరణంలో మార్పులు

ఈ క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పట్టణీకరణ, వాహనాల కాలుష్యం, చెట్లు నరికివేయడం వంటి కారణాల వల్ల వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వాతావరణ శాఖ అధికారుల సలహాల ప్రకారం ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయటకు రాకపోవడం మంచిది.

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లలో ఏపీ టాప్!
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లలో ఏపీ టాప్!

రైతులకు వాతావరణ శాఖ అలెర్ట్

తగినంత నీళ్లు తాగి శరీర డీహైడ్రేషన్‌ను నివారించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మసాలా ఆహారాలు, మద్యం తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక అకాల వర్షాలతో రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రైతులను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు, వేడి గాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+