మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణ పరిమితిని డబుల్ చేసింది. అంటే రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క వెల్లడించారు. వీటికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని అన్నారు. రుణాలకు చెల్లించే వడ్డీల కోసం ప్రభుత్వం ఏటా రూ. 2,500 కోట్లు ఖర్చు పెడుతోందని అన్నారు. అటు పంట కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం మహిళా సంఘాలకు అప్పగించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

Telangana Boosts Women SHG Interest-Free Loan Limit Doubled From 5 Lakh to 10 Lakh Details Inside

2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 26,621.47 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను అందించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలు రూ. 25,228.89 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పొందాయని వివరించారు. గత రెండేళ్లలో బ్యాంక్ లింకేజీ రుణాల కింద ప్రభుత్వం మొదట రూ. 40 వేల కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. బ్యాంకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో రూ. 60,000 కోట్ల విలువైన రుణాలను విజయవంతంగా పంపిణీ చేసినట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+