రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు..
పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పలువురు అధికారులను బదిలీ చేయగా మరికొంత మందికి కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు , జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్లతో సహా పలువురు ఉన్నతాధికారులకు కొత్తగా బాధ్యతలు అప్పగించారు.

వీరిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దాన కిశోర్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా హనుమంతు, కార్మిక శాఖ సెక్రటరీగా దాసరి హరిచందన అలాగే ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గా అభిలాష అభినవ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణా ఆదిత్య, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బీఎం సంతోష్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్ నియమితులయ్యారు.
IAS Transfers and Postings pic.twitter.com/BZaEevmCPm
— IPRDepartment (@IPRTelangana) April 25, 2026
అలాగే తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. హైదరాబాద్ కలెక్టర్ గా ప్రియాంక, సంగారెడ్డి కలెక్టర్ గా ప్రతీక్ జైన్ , ఖమ్మం కలెక్టర్‌గా దివాకర, నిర్మల్ కలెక్టర్ గా భవేష్ మిశ్రా, నారాయణపేట కలెక్టర్ గా ప్రియాంక, ములుగు కలెక్టర్ గా హేమంత్ సహదేవరావ్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ గా హెచ్ కే పాటిల్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా కిరణ్మయి,కుమురంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా యువరాజ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పాలనను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు.. సీనియర్ అధికారుల అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బదిలీలు జరిగినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications