ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, బకాయిల విడుదల..!!
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల పై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులతో చర్చ వేళ ప్రభుత్వం నెలకు రూ. 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. కాగా, ఇప్పుడు ఏప్రిల్ నెల చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ 1000 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్దిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ ఈ మేరకు నిధుల విడుదల చేసారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ 700 కోట్ల విడుదలకు హామీ ఇచ్చింది. ఈ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతీ నెలా ఉద్యోగ సంఘాల కు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసింది. కాగా, ఉద్యోగుల ఆర్దిక అవసరాల ను గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఆర్దిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ 1000 కోట్ల విడుదల అయ్యాయి.

హైకోర్టు ఆదేశాలు.. దశల వారీగా చెల్లింపులు
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కు సంబంధించి ఈ నిధులు విడుదల చేసారు. అక్టోబర్ 2025 వరకు పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేసారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగు లు కోర్టుకు వెళ్లారు. వీరి పిటీషన్ల పైన విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు గడువు ఖరారు చేసింది. దీంతో.. ప్రభుత్వం చెల్లింపులు ప్రారంభించింది. ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన బకాయిల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కోర్టు నిర్దేశించిన గడువులో గా రిటైరైన ఉద్యోగుల బకాయిలను విడుదల చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది.












Click it and Unblock the Notifications