"తెలంగాణ" పేరుతో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చాయో తెలుసా ???
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాలిక ఉద్యమం నేపథ్యంలో "తెలంగాణ" పేరుతో అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఏర్పడ్డాయి. కొన్ని పార్టీలు నేరుగా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి ప్రభావం చూపగా, మరికొన్ని ఉద్యమ వేదికలుగా పనిచేశాయి. కాగా నాటి నుంచి 'తెలంగాణ' పేరుతో ఉన్న పార్టీలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఈ పేర్లు చుట్టూ అనేక సెంటిమెంట్లు, రాజకీయ సమీకరణాలు ముడిపడి ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత తన "తెలంగాణ రాష్ట్ర సేన" పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలంగాణ పేరుతో పలు పార్టీలు..
తెలంగాణ రాష్ట్ర సమితి..
తెలంగాణ ఉద్యమ కాలంలో పుట్టిన పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అత్యంత శక్తివంతమైనది. 2001 లో కేసీఆర్ ఈ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఈ పార్టీ.. రాష్ట్ర ఏర్పడ్డాక రెండు సార్లు అధికారం లోకి వచ్చింది. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ దీనిని భారత్ రాష్ట్ర సమితి (BRS) గా మార్చిన తర్వాత, ఆ పేరులోని ప్రాంతీయ గుర్తింపు (Telangana Identity) తగ్గిందనే వాదనలు వినిపించాయి.

తెలంగాణ జన సమితి (TJS)..
స్థాపకుడు: కోడండరాం
స్థాపన: 2018
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నుంచి ఈ పార్టీ వచ్చింది
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ప్రధాన అజెండా
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)..
వైఎస్ షర్మిల ఈ పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్..
స్థాపకుడు: గద్దర్
లక్ష్యం: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజా ఉద్యమం
ఎక్కువగా ఉద్యమాత్మక వేదికగా పనిచేసింది, ఎన్నికల రాజకీయాల్లో పరిమిత పాత్ర
తెలంగాణ ప్రజా సమితి (1969 కాలం)
స్థాపకుడు: మర్రి చెన్నా రెడ్డి
స్థాపన: 1969
1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనమైంది
తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ (ప్రస్తుతం ప్రభావం తక్కువ)..
తెలంగాణ పేరుతో ఏర్పడిన చిన్న ప్రాంతీయ పార్టీ
రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేదు
జై తెలంగాణ పార్టీ..
స్థాపకుడు: పి.ఇంద్రారెడ్డి (సంబంధిత ఉద్యమ నేపథ్యం)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన మరో పార్టీ
నవ తెలంగాణ పార్టీ ( దేవేందర్ గౌడ్) - తల్లి తెలంగాణ పార్టీ ( విజయశాంతి) - తెలంగాణ జన సమితి (కోదండరాం) - తెలంగాణ రాజ్యాధికార పార్టీ ( తీన్మార్ మల్లన్న) - తెలంగాణ సాధన సమితి (ఆలె నరేంద్ర) - తెలంగాణ ఇంటి పార్టీ ( చెరుకు సుధాకర్) - తెలంగాణ నగారా సమితి ( నాగం జనార్ధన్ రెడ్డి) తెలంగాణ రక్షణ సమితి (డాక్టర్.రాజేశ్వర్ రావు) - తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (విమలక్క)












Click it and Unblock the Notifications