టెక్ జాబ్ అని చెప్పి గొర్రెల కాపరిని చేశారు.. నన్ను కాపాడండి.. సౌదీలో తెలంగాణ యువకుడి ఆవేదన
చాలామంది విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఇక్కడి కంటే విదేశాల్లో రెండింతలు సంపాదించొచ్చని పేద, మధ్య తరగతి యువకుల ఆలోచన. అందులో భాగంగా కొంతమంది అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వెళ్తుంటారు. మరికొంతమంది సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ లాంటి దేశాలకు వెళ్తుంటారు. గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు దాదాపు కోటి మంది ఉండొచ్చని అంచనా. అత్యధికంగా యూఏఈ లో దాదాపు 35 లక్షల మంది నివాసం ఉంటున్నారు. రెండో స్థానంలో సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియాలో భారతీయుల సంఖ్య 25 లక్షలకు పైగానే ఉంది. అలాగే కువైట్, ఖతార్ లోనూ దాదాపు 5 లక్షల మంది భారతీయులు ఉపాధి కోసం వెళ్తున్నారు.

అయితే తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టుబుట్టం రాజపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల దాసరి అరవింద్ కూడా ఎన్నో కలలతో డబ్బు సంపాదించేందుకు సౌదీ వెళ్లాడు. అరవింద్ కు ప్యాకింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇస్తామని నమ్మించి తీసుకెళ్లారు. అలా ఫిబ్రవరి 15 న సౌదీ వెళ్లాడు అరవింద్. ఇందుకోసం ఏజెంట్ రూ. 90 వేలు వసూలు చేశాడు. తీరా అక్కడికి వెళ్లాక అరవింద్ మోసపోయాడు. సౌదీ రాజధాని రియాద్ కు దాదాపు 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా పనిచేయాలని బలవంతం చేశారు.
Telangana migrant worker Dasari Aravind, stranded in a remote Saudi desert after an alleged job fraud, appeals for rescue in a viral video. His family has sought intervention from the Telangana government for his repatriation.
— The Siasat Daily (@TheSiasatDaily) May 9, 2026
Video: Facebook/bheem.reddy.mandha pic.twitter.com/beMzhCXnmt
కనీస వసతులు లేని ఆ ఎడారిలో దిగ్గుతోచని స్థితిలో అరవింద్ ఉన్నాడు. తాగడానికి నీళ్లు లేవు. ఆహారం లేదు. విద్యుత్ లేదు. సరైన వసతి, జీతం లేక ఇబ్బంది పడుతున్నాడు. అతని స్పాన్సర్ అరవింద్ సిమ్ కార్డులు లాగేసుకున్నాడు. అలాగే అతని సోషల్ మీడియా ఖాతాలు కూడా డిలీట్ చేశాడు. ఇప్పుడు అరవింద్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అరవింద్ తల్లి రాజవ్వ.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అలాగే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సభ్యులు అరవింద్ ను కలిసి అతనికి నిత్యావసర సరుకులు ఇచ్చి అండగా నిలిచారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.












Click it and Unblock the Notifications