ఉచిత విద్య, వైద్యం.. పాంచజన్యంతో వస్తున్నాం.. మా టార్గెట్ అదే: కవిత!
సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చామని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపడమే సర్వోదయ తెలంగాణ లక్ష్యమని, దానిని సాధించటం కోసం పాంచజన్యం అనే ఐదు అంశాలను తీసుకొని పోరాటం చేయబోతున్నాం అన్నారు.
యుద్ధభేరియే పాంచజన్యం: కవిత
20 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ జాగృతి స్వచ్చంద సంస్థగా అలాగే కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపైన తెలంగాణ రక్షణ సేన మాట్లాడుతుంది. పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అధర్మంపై యుద్ధం చేయడానికి శ్రీకృష్ణుడు మోగించిన యుద్ధభేరియే పాంచజన్యం అని కవిత పేర్కొన్నారు. తాము కూడా అదే స్ఫూర్తితో పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్యత అంశాలను తీసుకున్నాం అన్నారు.

మా ఫోకస్ ప్రధానంగా వాటిపైనే
ఇప్పుడు ప్రతిపక్షంగా...రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవే అంశాలను తీర్చటంలో మా ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో చాలా కుటుంబాల్లో విద్య, వైద్యం కోసమే 60 శాతం ఆదాయం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో సేవింగ్స్, ఎమర్జెన్సీ వస్తే ప్రజల దగ్గర డబ్బు ఉంటే పరిస్థితి లేదన్నారు.
అందరికీ ఉచిత విద్య
ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నప్పటికీ 75 శాతం ప్రజలు ప్రైవేట్ లోనే చదువుతున్నారని, తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్ లో చదివే వారికి కూడా వారు ఎంత వరకు చదువుతారో అంత వరకు కూడా ఉచిత విద్యను అందిస్తాం అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించడమే లక్ష్యమని, అది తాము సుసాధ్యం చేసి చూపిస్తామన్నారు.
అందరికీ ఉచిత వైద్యం, రైతులపైనా ఫోకస్
వైద్యం విషయంలో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని ఇవ్వడానికి తాము సంకల్పించాము అని అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతన్న ఆత్మగౌరవం కోసం తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, రైతన్నలకు మేలు చేసే విషయంలో సీరియస్ గా పని చేస్తామన్నారు.
యువతకు ఉపాధి
రాష్ట్రంలో ఉపాధి ఒక జోక్ గా మారిందని, యువతకు ఉపాధి కల్పించడం కోసం జెన్ జి తో పాటు, 25 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు ఉన్న వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి రెండు లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణం ఇస్తామన్నారు. యువత జాబ్ ఇచ్చేలా వారిని సిద్ధం చేస్తామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను అన్నింటిని భర్తీ చేసి ప్రభుత్వ శాఖలను బలోపేతం చేస్తానన్నారు.
సామాజిక న్యాయంపై కవిత
నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు మా వద్ద ఉన్నాయన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అనేది మరో అంశమని పేర్కొన్న కవిత అగ్రవర్ణాల్లో పేదలు, వికలాంగులకు, మాజీ మావోయిస్టులు, మాజీ ఆర్మీ వాళ్లకు, దేశంలోని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించటం కూడా సామాజిక న్యాయమే అన్నారు.
అమ్మలాంటి పాలన చేసినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం
సొసైటీ లో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయం అని పేర్కొన్నారు. అమ్మలాంటి పాలన చేసినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అని స్పష్టం చేశారు. తాము ఆ దిశగానే పాలన సాగిస్తామని, అధికారంలోకి వచ్చే వస్తే చెప్పింది చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications