AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ..! ఏఐ ఉద్యోగాల జాతరేనా?

ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు భారత్ కేంద్రంగా కొత్త పెట్టుబడులు పెడుతున్నాయి. అదీ అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న ఏఐ, డేటా సెంటర్లలో. గూగుల్ ఇప్పటికే ఏపీలోని విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. నిన్న మరికొన్ని దిగ్గజ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ఈ రెండు నిర్ణయాలు మన టెక్ ఉద్యోగుల్లో ఆశలు రేపుతున్నాయి.

గూగుల్, మైక్రోసాఫ్టే కాదు ఇంటెల్, బ్రూక్ ఫీల్డ్ వంటి సంస్థలు సైతం ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. మన దేశ మార్కెట్ సైజును దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నాయి. బహుళజాతి కంపెనీలకు అతిపెద్ద ఆకర్షణగా మారిన ఇంజనీరింగ్ డిగ్రీలతో సిద్ధంగా ఉన్న లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పనకు ఇది శుభవార్త కాబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఏఐతో తమ ఉద్యోగాలు పోతాయన్న భయమే తప్ప కొత్త ఉద్యోగాలపై ఆశలు లేని తరుణంలో టెక్ దిగ్గజాల రాక శుభసూచికంగా మారనుంది.

AI and Data Center Boom Tech Giants Billion-Dollar Bets Set to Transform India s Job Market

నిన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోడీని కలిశారు. మైక్రోసాఫ్ట్ నాలుగు సంవత్సరాల కాలంలో క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాలలో $17.5 బిలియన్ల పెట్టుబడి పెట్టబోతోందని ప్రకటించారు. ఇది ఆసియాలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. అలాగే ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ కూడా ప్రధాని మోడీని కలిసి భారతదేశ సెమీకండక్టర్ మిషన్‌ కు సాయం చేస్తామని ప్రకటించారు. భారత సెమీకండక్టర్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇంటెల్ టాటా ఎలక్ట్రానిక్స్‌తో ఒప్పందం చేసుకుంది.

అమెజాన్ కూడా ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన కోసం $35 బిలియన్లతో తరలివస్తోంది. తద్వారా అమెజాన్ మన దేశంలో 10 లక్షల అదనపు ఉద్యోగాలు సృష్టించాలని చూస్తోంది. భారత్ నుండి $80 బిలియన్ల ఈ-కామర్స్ ఎగుమతుల్ని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ ఇప్పటికే విశాఖపట్నంలో గిగావాట్-స్కేల్ డేటా సెంటర్/ఏఐ హబ్ సామర్థ్యాన్ని నిర్మించే $15 బిలియన్ల పెట్టుబడితో తరలివస్తోంది. దీంతో లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా.

AI and Data Center Boom Tech Giants Billion-Dollar Bets Set to Transform India s Job Market

అలాగే ఓపెన్ ఏఐ సైతం భారతదేశంలో డేటా హబ్ కోసం అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ మెగా హబ్‌లపై ఆధారపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్ధల్ని కూడా ఇవి ఆకర్షిస్తున్నాయి. భారీ ఏఐ డేటా సెంటర్ల బూమ్ ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ కార్మికులు, రిటైల్, ఇతర సంబంధిత పరిశ్రమలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుంది. ఈ ఉద్యోగాలు చాలా వరకు ఏఐ డేటా సెంటర్ల 'గ్రే స్పేస్'లో వస్తాయని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+