ఏఐ మానవత్వాన్ని చంపేయడం ఖాయం..! తేల్చేసిన కృత్రిమ మేథ సృష్టికర్త..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ దూకుడు కనిపిస్తోంది. రంగాలతో సంబంధం లేకుండా ప్రతీ చోటా ఏఐ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. ఇందులో భాగంగా సంస్థలు ఏఐ వాడకం పెంచుకుని ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని చూస్తుంటే.. ఉద్యోగులు ఏఐ నైపుణ్యాలు పెంచుకుని తమ ఉద్యోగాలు కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ పితామహుడిగా పేరున్న నోబెల్ పతక గ్రహీత జెఫ్రీ హింటన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏఐ మానవత్వాన్ని చంపేస్తుందన్నారు.
అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఏఐ 4 సదస్సులో పాల్గొన్న జెఫ్రీ హింటన్ కృత్రిమ మేతతో ఎదురవుతున్న భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ వ్యవస్థల్లోకి మాతృ ప్రవృత్తులను చొప్పించడం ద్వారా మానవ లక్షణాలను అలవర్చుకుని వారిని కాపాడే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో గత కొన్నేళ్లుగా ఏఐ రాకతో తలెత్తే సమస్యలపై నెలకొన్న ఆందోళనలు మరింత పెరిగాయి.

డీప్ లెర్నింగ్ నైపుణ్యాలపై పరిశోధనలు చేసిన జెఫ్రీ హింటన్.. గతంలో ఏఐ రాక 10 నుంచి 20 శాతం మనుషులపై ప్రభావం చూపిస్తుందని తేల్చారు. మనుషుల్ని ఏఐ యంత్రాలు దాటిపోతే ఎదురయ్యే సమస్యల్ని హింటన్ సవాల్ చేస్తున్నారు. మనుషుల్ని అధిగమించకుండా ఏఐ యంత్రాల్ని అదుపులో ఉంచుకునేందుకు సంస్థలు చేస్తున్న ప్రయత్నాల వేళ హింటన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే భవిష్యత్తులో ఏఐ వల్ల భద్రత, నైతికత, దీర్ఘకాల సామాజిక ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలకు హింటన్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఏఐ మీద ఎప్పటికీ ఆధిపత్యం చెలాయించాలన్న మానవ ప్రయత్నాలను హింటన్ తోసిపుచ్చారు. మనుషుల కంటే మెరుగ్గా పనిచేయడం ప్రారంభించాక ఏఐ యంత్రాలు మనుషులు విధించిన ఆంక్షల్ని దాటేస్తాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏఐ దాన్ని తయారు చేసిన వారి కంటే మెరుగ్గా మారిపోతుందన్నాడు..












Click it and Unblock the Notifications