Infosys-Anthropic: ఆంత్రోపిక్-ఇన్ఫోసిస్ డీల్-మన ఐటీ రంగానికి పండగేనా ?

అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic)తో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఆంత్రోపిక్ తో ఇన్ఫీ కుదుర్చుకున్న ఈ ఒప్పందం భారత ఐటీ రంగ చరిత్రలో పెనుమార్పులకు దారి తీస్తుందన్న సంకేతాలు వెలువడ్డాయి. సీన్ కట్ చేస్తే .. ఇన్ఫోసిస్ తో పాటు భారత ఐటీ షేర్లన్నీ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భారత ఐటీ సంస్థల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

ఆంత్రోపిక్‌తో ఇన్ఫోసిస్ ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్యం మార్కెట్లలో ఈ పెరుగుదలకు కారణమైంది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవలను నిరుపయోగంగా మారుస్తుందనే భయాలతో దెబ్బతిన్న స్టాక్ మార్కెట్ కు ఇదో ఒక బలమైన పునరుజ్జీవనంగా భావిస్తున్నారు. ఆంత్రోపిక్ అధునాతన క్లాడ్ మోడల్‌లను (క్లాడ్ కోడ్‌తో సహా) ఇన్ఫోసిస్ యాజమాన్య టోపాజ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి కీలక రంగాలకు ఇది బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

AI s New Role Infosys-Anthropic Deal Positions Technology as Opportunity for Indian IT

ఆంత్రోపిక్ సీఈవో, సహ-వ్యవస్థాపకుడు డారియో అమోడి ఈ డీల్ పై స్పందిస్తూ..డెమోలో పనిచేసే AI మోడల్‌కు, నియంత్రిత పరిశ్రమలో పనిచేసే మోడల్‌కు మధ్య పెద్ద తేడా ఉందని, దానిని తగ్గించాలంటే డొమైన్ నైపుణ్యం అవసరమన్నారు. ఇన్ఫోసిస్‌కు టెలికాం, ఆర్థిక సేవలు, తయారీ వంటి ముఖ్యమైన పరిశ్రమలలో ఈ నైపుణ్యం ఉందన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ AI సహకారంతో ఆరు కొత్త సేవా విభాగాలను గుర్తించారు. ఏఐ వ్యూహం, ఇంజనీరింగ్, ఏజెంటిక్ లెగసీ ఆధునీకరణ, డేటా సంసిద్ధత, ప్రక్రియల పునఃరూపకల్పన, ఫిజికల్ ఏఐ , ఏఐ ట్రస్ట్ వాటిలో కొన్ని. 2030 నాటికి $300–$400 బిలియన్ల మార్కెట్ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా కంపెనీని ఆయన తీర్చిదిద్దుతున్నారు.

AI s New Role Infosys-Anthropic Deal Positions Technology as Opportunity for Indian IT

రెండేళ్లుగా భారతీయ ఐటీ రంగం రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తోంది. జనరేటివ్ ఏఐ సిబ్బందిని తగ్గిస్తుందని, ప్రాజెక్ట్ పరిధిని కుదిస్తుందని, కార్మిక-ఆర్బిట్రేజ్ నమూనాను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారుల నుంచి ఆందోళనలను ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్-ఆంత్రోపిక్ ఒప్పందం ఈ ఆందోళనలకు చెక్ పెట్టింది. భారతీయ ఐటీని ఏఐ తరంగంలో నష్టపోయిన కంపెనీగా కాకుండా, సరికొత్త మోడళ్లకు, ప్రపంచ సంస్థల సంక్లిష్ట, నియంత్రణలతో కూడిన వాస్తవ ప్రపంచానికి మధ్య వారధిగా నిలబెట్టాలనేది దీని లక్ష్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+