iPhone యూజర్లకు గూగుల్ రూ. 9,025 కోట్ల గిఫ్ట్- ఇకపై..!!

ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్.. కొనుగోలుదారులకు తీపి కబురు వినిపించింది. తమ అనుబంధ సంస్థ సిరి, ఆపిల్ ఇంటెలిజెన్స్ (Apple Intelligence) వ్యవస్థల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఐఫోన్లకు కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు అందించనుంది. దీనికోసం కాలిఫోర్నియాకు చెందిన ఈ టెక్ దిగ్గజం.. గూగుల్ జెమిని (Google Gemini) మోడల్స్‌ను ఉపయోగించనుంది. ఏఐ రేసులో గూగుల్, ఓపెన్‌ఏఐల కంటే వెనుకబడిన ఆపిల్ వెనుకపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈ మేరకు ఆపిల్- గూగుల్ మధ్య ఓ ఒప్పందం సైతం కుదిరింది. తాను డెవలప్ చేసిన సిరి ఏఐ టూల్ ను మరింత బలోపేతం చేయడానికి గూగుల్ జెమిని ఏఐ మోడల్స్‌ను వినియోగిస్తుంది. దీంతో సంక్లిష్టమైన పనులను కూడా ఈ వర్చువల్ అసిస్టెంట్ మరింత మెరుగ్గా నిర్వహించగలదని వినియోగదారులు ఆశిస్తోన్నారు. ప్రస్తుతం యూజర్లు కోరే కొన్ని రకాల సంక్లిష్ట ప్రశ్నలకు సిరి ఏఐ టూల్.. ఓపెన్‌ఏఐ డెవలప్ చేసిన చాట్‌జీపీటీని వాడుతోంది.

Apple and Google AI Partnership to Power Siri with Gemini

ఇకపై ఈ పరిస్థితి ఉండదు. జెమిని ఏఐ సపోర్ట్ తో ఐఫోన్‌లోని వర్చువల్ అసిస్టెంట్‌తోనే అన్ని పనులు సాధ్యమవుతాయి. జెమిని ఏఐతో అనుసంధానం కావడం వల్ల యూజర్ల అవసరాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలదని యాపిల్ సంస్థ చెబుతోంది. స్క్రీన్‌పై సమాచారాన్ని గుర్తించి దానికి అనుగుణంగా యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తుందని స్పష్టం చేస్తోంది. మెయిల్, మెసేజెస్ యాప్‌ల నుండి ఫ్లైట్ రిజర్వేషన్ వివరాలను సిరి ఏఐ టూల్ యాక్సెస్ చేస్తుంది.

అన్ని రకాల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను ఐఫోన్ యూజర్లకు చేరువ చేస్తామని 2024లో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరి ఏఐ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో ప్రకటన చేసింది గానీ దీనికి అనుగుణంగా అన్ని ఫీచర్లను యాపిల్ ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు దీన్ని అధిగమించడంలో భాగంగా జెమిని మోడల్స్‌ను నేరుగా ఉపయోగించనుంది. దీంతో ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేసే అన్ని ఐఫోన్లకు మరింత అధునాతన ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఒప్పందం వెనుక ఆర్థిక వివరాలను గూగుల్ గానీ, యాపిల్ గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం గూగుల్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించేందుకు ఆపిల్ ఏడాదికి కనీసం ఒక బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 9,025 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని అంచనా. క్రోమ్ ను ఐఫోన్లలో డిఫాల్ట్‌గా ఉంచడానికి ఆపిల్‌కు 20 బిలియన్ డాలర్లను గతంలో చెల్లించింది గూగుల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+