AI వరమా ? శాపమా ? యువతకు పోప్ లియో వార్నింగ్..!

ఈ రోజుల్లో కృత్రిమ మేథ (AI)లేని ప్రపంచాన్ని ఊహించలేని పరిస్ధితి. ఎక్కడ చూసినా కృత్రిమ మేథ అన్ని రంగాల్లోనూ దూసుకొచ్చేస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేథ వల్ల కలిగే లాభాలు, నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా అంతకు మించిన చర్చలే జరుగుతున్నాయి. దీనిపై తాజాగా పోప్ బాధ్యతలు చేపట్టిన లియో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జరిగిన రెండవ రోమ్ సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి పోప్ లియో ప్రసంగించారు. ఇందులో ఆయన ఏఐ కంటెంట్ కు అతిగా అలవాటు పడటం వల్ల యువత వాస్తవికతను అర్థం చేసుకునే, విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ఎలా కోల్పోతుందో ఆయన వెల్లడించారు. పిల్లలు, యువకుల, వారి మేధో, నాడీ అభివృద్ధిపై ఏఐ వాడకంతో కలిగే పరిణామాల పట్ల అందరూ ఆందోళన చెందుతున్నట్లు పోప్ తెలిపారు.

Boon or Bane Here s Pope Leo s Warning on AI s Impact on Young Minds

మే 8న పోప్ గా ఎన్నిక తర్వాత పోప్ లియో తరచుగా ఏఐపై ఫోకస్ పెట్టారు. ఏఐ సృష్టించిన భారీ డేటాను ఫిల్టర్ చేయకుండా నిరంతరం వాడటం వల్ల నిజమైన మేధస్సు లేదా జ్ఞానం గందరగోళంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.ఏఐ ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారానికి ఇంత త్వరగా యాక్సెస్ ఏ తరానికీ లభించలేదని, కానీ డేటా ఎంత విస్తృతంగా ఉన్నా, దానిని మనిషి తెలివితేటలతో పోల్చకూడదని పోప్ హెచ్చరించారు.

ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడంలో ఏఐ పాత్రను అంగీకరిస్తూనే, ఈ ప్రయోజనాలను మానవాళి సామర్థ్యాలను దెబ్బతీసే అంశాలతో పోల్చి చూడాలని పోప్ కోరారు. పోప్ లియో స్వయంగా ఏఐ దుర్వినియోగానికి బాధితుడిగా మారారు. తాజాగా పోప్ డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియో సందేశాలు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. దర్యాప్తులో ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో పోప్ స్వరాన్ని అనుకరిస్తూ యూట్యూబ్ , టిక్‌టాక్‌లలో డజన్ల కొద్దీ ఏఐ-జనరేటెడ్ క్లిప్‌లు వెలుగుచూశాయి.

Boon or Bane Here s Pope Leo s Warning on AI s Impact on Young Minds

ఈ నేపథ్యంలో పోప్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ జర్నలిజం నిర్వహించిన సర్వేలో వార్తల ముఖ్యాంశాలు, అప్ డేట్స్ తెలుసుకోవడానికి యువ వినియోగదారులు ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌లపై ఆధారపడుతున్నారని తేలింది. దీంతో యువ ప్రేక్షకులు ఈ డిజిటల్ యుగంలో సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారనే దానిపై ప్రశ్నలు మొదలయ్యాయి. అలాగే కాథలిక్ చర్చి కొత్త టెక్నాలజీల చుట్టూ నైతిక చర్చలు చేపడుతోంది. పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో వాటికన్ 2020లో రోమ్ కాల్ ఫర్ ఏఐ ఎథిక్స్‌ను ప్రారంభించింది. దీనిని మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు, ఐక్యరాజ్యసమితి, విద్యాసంస్థలు కూడా ఆమోదించాయి. ఇప్పుడు పోప్ కూడా హెచ్చరికలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+