ఏఐ సమ్మిట్ లో రోబో డాగ్ తెచ్చి పెట్టిన కష్టం
న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ రోబో డాగ్.. సమస్యలను తెచ్చిపెట్టింది. నొయిడాకు చెందిన ఓ యూనివర్శిటీ పరువు తీసింది. తక్షణమే ఏఐ సమ్మిట్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ నిర్వాహకులు ఆ యూనివర్శిటీని ఆదేశించేంత వరకూ వెళ్లిందీ వ్యవహారం. చైనా రూపొందించిన ఓ రోబోటిక్ డాగ్ ను తాము సొంతంగా డెవలప్ చేసినట్లు ఆ యూనివర్శిటీ చెప్పుకోవడం ఈ వివాదానికి కేంద్రబిందువు అయింది.
అది- గల్గొటియాస్ యూనివర్సిటీ. గ్రేటర్ నొయిడాకు చెందిన విశ్వవిద్యాలయం ఇది. చైనీస్ రోబోటిక్ డాగ్ ను తమ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకొంది. దీన్ని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రదర్శించింది. ఈ రోబో డాగ్ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి కూడా. ఈ రోబో యూనిట్రీ గో2 మోడల్ కు చెందినది. ఇది చైనీస్ రోబోటిక్స్ కంపెనీ యూనిట్రీ తయారు చేసింది. భారత్ లో దీని ఆన్‌లైన్ ధర రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటోంది.

ఏఐ సమ్మిట్ లో దీనికి ఒరియన్ అని పేరు పెట్టి ప్రదర్శించిందా గల్గొటియాస్ యూనివర్శిటీ. ఈ రోబోటిక్ డాగ్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసిందని యూనివర్సిటీ ప్రతినిధులు స్పష్టంగా వెల్లడించారు. సమ్మిట్ లో విలేకరులతో మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా యూజర్ల కన్ను దీనిపై పడింది. దీని గురించి ఆరా తీశారు. ఇది చైనా నుంచి దిగుమతి చేసుకున్న యూనిట్రీ గో2గా గుర్తించారు. విదేశీ సాంకేతికతను తమ సొంత ఆవిష్కరణగా ఆ యూనివర్శిటీ చూపించిందని ఆరోపించారు.
దీనిపై గల్గొటియాస్ యూనివర్సిటీ ఎక్స్ ద్వారా స్పందించింది. ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ రోబోటిక్ డాగ్ ను యూనిట్రీ నుండి కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. స్టూడెంట్లకు ప్రాక్టికల్ గా రోబోను పరిచయం చేయడానికే దీన్ని కొన్నామని పేర్కొంది. దీన్ని తామే తయారు చేశామంటూ యూనివర్శిటీ ప్రతినిధులు చెప్పినప్పటికీ అది అధికారిక ప్రకటనగా భావించకూడదని వివరణ ఇచ్చింది. అలా నిర్మించామని ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది.
ఈ పరిణామాలపై ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వాహకులు స్పందించారు. సమ్మిట్ ను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. యూనివర్శిటీ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తొలగించాలని సిబ్బందిని సూచించినట్లు చెబుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications