సింహరాశి, కన్యా రాశి సెప్టెంబరు నెల జాతకఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. దీన్ని ప్రభావితమయ్యే రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి.
అలాగే సెప్టెంబరు నెలకు సంబంధించి సింహరాశి, కన్యా రాశికి సంబంధించినవారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో సూర్యుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంక్రమిస్తాడు. సాధారణ జ్యోతిష్య పరిగణనల ఆధారంగా సింహ రాశి, కన్యా రాశి వారికి సెప్టెంబరు నెల ఫలితాలు ఇలా ఉన్నాయి.

సింహ రాశి (మఖ, పూర్వఫల్గుణి, ఉత్తరఫల్గుణి 1వ పాదం)
సింహ రాశి వారికి సెప్టెంబరు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల మొదటి భాగంలో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ, రెండో భాగంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. తోటి ఉద్యోగులు లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు సహనం వహించడం మంచిది. వ్యాపారులకు నెల ద్వితీయార్థంలో మంచి లాభాలు, కొత్త అవకాశాలు అందుకునే సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశముంది. అనవసర వ్యయాలను తగ్గించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న డబ్బులు చేతికందే అవకాశం ఉంది.
ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. మాట పట్టింపులకు పోకుండా ఉండటం శ్రేయస్కరం. ఆరోగ్యం విషయానికి వస్తే కంటి సమస్యలు లేదా తలనొప్పి వంటి చిన్నపాటి రుగ్మతలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్యనమస్కారాలు చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
కన్యా రాశి (ఉత్తరఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
కన్యా రాశి వారికి ఈ నెలలో జన్మ రాశిలోకి సూర్య సంచారం జరగడం వల్ల ఉత్సాహం, పురోగతి లభిస్తాయి. ముఖ్యమైన పనులు నెరవేరే సమయం. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన పెట్టుబడులకు, విస్తరణకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
పాత రుణాలు తీర్చడానికి లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా గతంలో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, పనిఒత్తిడి వల్ల అలసట చెందకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా బుధవారం నాడు శ్రీ విష్ణు ఆలయాన్ని దర్శించడం మేలు చేస్తుంది.














Click it and Unblock the Notifications