AI మాయాజాలం: ఈ బుడ్డోడు.. ఇప్పుడో అపర కుబేరుడు: ఎవరో చెప్పుకోండి..!!
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. దాదాపుగా అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోన్నాయి. మ్యాన్ పవర్ ను తగ్గించుకుంటోన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.
మరోవంక ఈ టూల్ వినియోగం భారీగా పెరుగుతోంది. గూగుల్, ఛాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ.. వంటి కంపెనీలు ప్రత్యేకంగా వీటి మీదే ఫోకస్ పెట్టాయి. ఏఐ టూల్స్ ను డెవలప్ చేయడంలో బిలియన్ల కొద్దీ డాలర్లను గుమ్మరించడానికీ వెనుకాడట్లేదు. దీన్ని బట్టి చూస్తోంటే.. ఈ రంగంలో ఏ స్థాయిలో కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా- ఓ అపర కుబేరుడికి సంబంధించిన ఓ చిన్నప్పటి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన వీడియో ఇది. ఓ ఫొటోకు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ జీవం పోసింది. దీన్ని ఇంత అందంగా డిజైన్ చేసింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, మైక్లోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన ఫొటో అది. దీన్ని వీడియోగా చిత్రీకరించింది గ్రోక్. ఈ వీడియో క్లిప్ ను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు మస్క్. సుమారు 50 సంవత్సరాల క్రితం తీసిన ఫొటోను.. ఇలా వీడియోగా మార్చడానికి గ్రోక్ AI టూల్ ను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.
ఈ వీడియో క్లిప్‌లో.. చిన్నపట్టి మస్క్ ఐస్‌క్రీమ్ తింటూ, ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. గ్రోక్ టాలెంట్ కు యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది- ఏఐ వీడియో అంటే నిజంగా నమ్మలేకపోతున్నానని, అత్యంత సహజంగా ఉందని వ్యాఖ్యానించారు.
గ్రోక్ AIతో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం iOSలో అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ సపోర్ట్ కూడా రానుంది. 'గ్రోక్ ఇమాజిన్' పేరుతో పనిచేస్తున్న ఈ టూల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరు వినియోగదారులకు ఉచితంగా లభిస్తోంది. ఇది AI ఆధారిత కంటెంట్ ను డెవలప్ చేస్తుంది.
Grok turns an old picture of me from 50 years ago into a video https://t.co/yYie9U6Kgs
— Elon Musk (@elonmusk) August 13, 2025












Click it and Unblock the Notifications