ఐఐటీల్లో ఏఐ కోర్సులు - ఎక్కడ ఏ శిక్షణ, జాబ్స్..!!
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ఏఐకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఏఐ కారణంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల ఉచకోత కొనసాగుతోంది. ప్రభుత్వాలు సైతం ఏఐ ఆధారిత సేవల వైపే మొగ్గు చూపుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రముఖ విద్యా సంస్థలు సైతం ఏఐ కోర్సుల శిక్షణ పెంచుతున్నాయి. ఇక..ఐఐటీల్లోనూ ఏఐ కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు.
దు కోసం ఆన్ లైన్ అవకాశం కల్పిస్తున్నాయి.
దేశంలోని చాలా ఐఐటీలు పలు విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీ ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో నడిచే ఈ కోర్సుల్లో చేరితే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో వీటిని పొందవచ్చు. తమ రెగ్యులర్ చదువులు కొనసాగిస్తూనే వీటిలో చేరవచ్చు. రాబోయే కాలం అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కే ప్రాధాన్యత ఉంటుంది. దీనికి అనుగుణంగా ఐఐటీ మద్రాస్, రూర్కీలు కొన్ని కోర్సులను రూపొందించాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ను ఉద్దేశించి ఐఐటీ మద్రాస్ 'వెబ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్' కోర్సును ప్రారంభించింది. దీనితోపాటుగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్(ఏరో స్పేస్, అమ్యునిషన్ టెక్నాలజీ), ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కోర్సులు అందిస్తున్నాయి.

అదే విధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మల్టీ మీడియా, మైక్రో ఎలకా్ట్రనిక్స్), మెకానికల్ ఇంజనీరింగ్(మెకానికల్ డిజైన్, అటోమోటివ్ టెక్నాలజీ), ఈ మొబిలిటీ తదితర కోర్సులు ఉన్నాయి. వివరాల కోసం code.iitm.ac.in/ webmtech సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో పాటుగా రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏఐ, జెన్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్'లలో పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది పదకొండు నెలల ప్రోగ్రామ్. లైవ్, రికార్డెడ్ సెషన్స్‌లో ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు హాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండేలా డిజైన్ చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications