Google ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ స్కీం, ఒప్పుకోకపోతే సంస్థను వీడొచ్చు..!!
గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీఫీషియల్ రంగానికి సంబంధించిన ప్రణాళికలను గూగుల్ విస్తరిస్తోంది. ఈ సమయంలోనే ఉద్యోగుల కుదింపు పైన కొత్త ప్రతిపాదనలు తెర మీదకు తీసుకొస్తోంది. ఈ సారి జీబీవో విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు లేఖలు అందాయి. గూగుల్ వీరి కోసం వాలంటరీ ఎగ్జిట్ స్కీం ప్రతిపాదించింది. ఎవరైతే గూగుల్ ప్లాన్స్ తో ఏకీభవించని ఉద్యోగులు ఎవరైనా స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని తేల్చి చెప్పింది.
గూగుల్ ఏఐ రంగానికి సంబంధించిన ప్రణాళికలతో ఏకీభవించలేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవచ్చని సంస్థ తాజాగా పేర్కొంది. గూగుల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (జీబీఓ) విభాగానికి చెందిన ఉద్యోగులకు సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఓ అంతర్గత లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా అడ్వర్‌టైజమెంట్, సర్వీసులు తదితర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ విభాగానికి చెందిన వారిని ఉద్దేశించి షిండ్లర్ ఈ లేఖను పంపారు.

2026 సంవత్సరాన్ని గూగుల్ మంచి లాభాలతో మొదలుపెట్టినా ఏఐ రంగంలో నిత్య మార్పులు తప్పవని షిండ్లర్ పేర్కొన్నారు. మెరుపు వేగంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వెనకబడితే కోల్పోయేది చాలా ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి, ఏఐకి సంబంధించి కంపెనీ ప్రణాళికలతో ఏకీభవించలేని, అంగీకరించలేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని సూచించారు.
ఉద్యోగులకు అంతర్గత సర్క్యులర్ జారీ
కాగా, ఏఐతో కలిగే పెను ప్రభావాలను స్వీకరించకతప్పదని చెప్పారు. ఇలా కుదరదన్న వారు సంస్థను వీడొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు పరిహారాన్ని కూడా సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. అందులో భాగంగా సొల్యూషన్స్ విభాగం, సేల్స్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లోని వారికి ఈ ప్రత్యామ్నాయాన్ని ఆఫర్ చేశారు. జీబీఓ విభాగం కార్యకలాపాలు గూగుల్ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైనప్పటికీ రాబోయే రోజుల్లో కస్టమర్లకు ఎలాంటి సేవాలోపం లేకుండా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపారు.
గతేడాది అమెరికాలో కూడా గూగుల్ తన ఆండ్రాయిడ్, కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్‌ను ఇచ్చింది. అయితే... గూగుల్‌తో పాటు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్‌లు కూడా తమ కార్యకలాపాల పునర్ వ్యవస్థీకరణకు దిగాయి. ఏఐ ఆధారిత బిజినెస్ విధానాల వైపు మళ్లే క్రమంలో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని ఇస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఉద్యోగులు తమ భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications