Grok కు మరింత పాలిష్ పెట్టిన మస్క్: కొత్తగా గ్రోకీపీడియా
Grokipedia: అపర కుబేరుడు, ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. గతంలో టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం xAIని పునర్వ్యవస్థీకరించారు. దీని పరిధిని మరింత విస్తృతం చేశారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యూజర్లకు అందజేయడానికి గ్రోకీపీడియాను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
ఎక్స్ ఏఐ.. ఈ గ్రోకీపీడియాను అభివృద్ధి చేస్తోంది. ఇది వికీపీడియాకు ప్రత్యామ్నాయం. గ్రోక్.. యూజర్లు అడిగిన పూర్తి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా వెల్లడించారు. వికీపీడియా కంటే ఎన్నో రెట్లు మెరుగైన గ్రోకీపీడియాను డెవలప్ చేస్తోన్నామని తెలిపారు. డిజిటల్ ఎన్‌సైక్లోపీడియా కంటే ఎక్కువ సమాచారాన్ని దీని నుంచి పొందవచ్చని అన్నారు. వెబ్ సోర్సెస్, పబ్లిక్ ట్వీట్‌లతో సహా వివిధ సమాచార వనరులను ఒకే ప్లాట్ ఫామ్ మీదికి గ్రోక్ తీసుకొస్తుందని, రియల్ టైమ్ కంటెంట్‌ను రూపొందిస్తుందని అన్నారు.

దీనిపై సోషల్ మీడియా యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు సైన్స్ ఫిక్షన్ ఆర్కైవ్‌లతో పోల్చారు. ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికా లేదా హిచ్‌హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ లాగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గ్రోకీపీడియా పేరును రిచిపీడియాగా మార్చాలని మరికొందరు సూచించారు. రెడ్డిట్‌ను కొనుగోలు చేసి దాని పేరును గ్రోకిట్ మార్చాలని కొందరు యూజర్లు సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు.
గ్రోక్ స్వయంగా వికీపీడియా సహా ఇతర వనరులపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు గ్రోకీపీడియా ఎలా విజయం సాధిస్తుందని సందేహాలు సైతం వ్యక్తం అయ్యాయి. చాలామంది యూజర్లు దీని గురించే ఎలాన్ మస్క్ ను ప్రశ్నించారు.
We are building Grokipedia @xAI.
— Elon Musk (@elonmusk) September 30, 2025
Will be a massive improvement over Wikipedia.
Frankly, it is a necessary step towards the xAI goal of understanding the Universe. https://t.co/xvSeWkpALy
సోర్స్ అనేది ఖచ్చితంగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని, అలాకాకుండా వికీపీడియా నుంచి సమాచారాన్ని తీసుకుని యూజర్లకు అందిచేదిగా ఉంటే అది సక్సెస్ కాకపోవచ్చని అంచనా వేశారు. ఫ్రీ ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా.. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఏడో వెబ్‌సైట్ గా రికార్డు నెలకొల్పిందని, వికీపీడియాను ఢీకొట్టడం అంత సులభతరం కాకపోవచ్చని మరికొంందరు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications