AI వల్ల పోతున్నవి అసలు ఉద్యోగాలే కాదు-ఓపెన్ ఏఐ సీఈవో షాకింగ్..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ దూకుడు కనిపిస్తోంది. కంపెనీలు వీలైనంత త్వరగా కృత్రిమ మేథను అందుకుని ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని, తద్వారా లాభాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. ఇందులో టెక్ ఉద్యోగాలు ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ కారణంగా ఉద్యోగాల తొలగింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మాన్ దీనిపై స్పందించారు. ఏఐ కారణంగా ప్రస్తుతం తీసేస్తున్న ఉద్యోగాలు అసలు పనే కాదని భవిష్యత్తులో నిరూపణ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత దృక్పథంతో చూస్తే అవి అసలు ఉద్యోగాలే కాదని, అసలు పనే కాదని భవిష్యత్తులో తేలిపోతుందన్నారు. భవిష్యత్ ఉద్యోగాలు వ్యవసాయంలా నిజమైన లేదా అవసరమైన ఉద్యోగాల్లా అనిపిస్తాయన్నారు.

ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాలు రాకముందే 100 కోట్ల నిపుణులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్ధితి తలెత్తుతుండటంపై అడిగిన ప్రశ్నకు శామ్ ఆల్ట్ మెన్ స్పందించారు. దీనికి ఓ రైతును ఉదాహరణగా చూపుతూ.. అతనికి వ్యవసాయం చేస్తుండటం వల్ల ఉద్యోగం పోతుందనే భయం ఉండదన్నారు. ఒకప్పుడు రైతు అవసరమైన దాన్ని పండించేవాడని, అది నిజమైన పని అని ఆల్ట్ మెన్ తెలిపారు. కానీ ప్రస్తుత కాలంలో మనం చేస్తున్న ఉద్యోగాలు అసలు పని కాదని, కేవలం మన సమయాన్ని భర్తీ చేయడానికి చేస్తున్నవే అని తేల్చేశారు.

భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలను చూస్తే గతంలో తాము చేసిన ఉద్యోగాలు రైతుల వ్యవసాయం లాగే అసలు పని కాదని మనకే అర్ధమవుతుందని ఆల్ట్ మెన్ తెలిపారు. ఇవి కేవలం మనల్ని సంతోష పరచడానికి చేస్తున్న పనులు మాత్రమేనన్నారు. గతంలో ఉండే రైతుల్ని అడిగితే మనం చేస్తున్న ఉద్యోగాలు ఫేక్ అని అంటారని, కానీ అదే ఏఐ కాలంలో ఉద్యోగాలు చేసే వారిని అడిగితే మాత్రం వాస్తవ ఉద్యోగాలే అంటారని విశ్లేషించారు.












Click it and Unblock the Notifications