మోదీతో భేటీ వేళ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన...!!
గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా కృత్రిక మేధ(AI), డిజిటల్ మౌలిక సదుపాయాల చుట్టూ సాగినట్లు తెలుస్తోంది. 'AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత దేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే చాలా మంది మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారు' అంటూ సుందర్ పిచాయ్ ఈ భేటీ వేళ చేసిన పోస్టు ఆసక్తి కరంగా మారుతోంది.
భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్-2026'లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు చేరుకున్నారు. కాగా, సుందర్ పిచాయ్ ఫిబ్రవరి 20న శిఖరాగ్ర సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ 'X' (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. 'AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత దేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే చాలా మంది మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారు.. అంటూ రాసుకొచ్చారు. ఈ సదస్సులో 110కి పైగా దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి.

కాగా.. భారత్ లో ఏఐ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. భారత్ లో ఈ మార్పు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థిరమైన పెట్టుబడులు, డేటా సెంటర్ ల ఏర్పాటు, స్థానిక భాగస్వాములతో కలిసి పరిశోధనలు నిర్వహించటం.. దేశంలోని ప్రతిభావంతులైన యవతకు దేశ, విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించటం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రధాని మోదీతో భేటీ వేళ కీలక చర్చలు
కాగా.. భారత్ లో క్లౌడ్ రీజియన్ స్థాపించటానికి రిలయన్స్ జియోతో కలిసి పని చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా 150 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భారత్ లో గూగుల్ డేటా సెంటర్ ను విస్తరించటానికి ఆదానీ, క్లీన్ మాక్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు తెలిపారు. భారత వినియోగదారుల కోసం మౌలిక సదుపాయాలే కాకుండా ఆర్టీఫీషియల్ ఆధారిత ఉత్పత్తులను డెవలప్ చేయటానికి గూగుల్ పని చేస్తోందని వివరించారు. ఏఐ సదస్సు కోసం భారత్ కు తిరిగి రావటం సంతోషంగా ఉందని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications