పక్కా ఇళ్లపై లబ్దిదారులకు గుడ్ న్యూస్- దరఖాస్తులో కొత్త విధానం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేద, ఇల్లు లేని కుటుంబాల కోసం ఉచిత గ్రామీణ గృహాలను మంజూరు చేస్తోంది. ఈ పథక నిర్వహణలో ఆవాస్ ప్లస్ యాప్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చెకర్ టూల్ కీలక పాత్ర పోషిస్తోన్నాయి. పీఎంఏవై- జీ ఆవాస్ ప్లస్ కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి కేంద్రం ఓ ప్రత్యేకమైన AI ఆధారిత టూల్ ను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే సొంత స్థలంలో పక్కా ఇల్లు ఉన్నప్పటికీ మళ్లీ గృహనిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఈ టూల్ గుర్తిస్తుంది. అధికారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారు అర్హుడా కాదా అనేది జియో ట్యాగింగ్ ఫొటోల ఆధారంగా ఏఐ నిర్ణయిస్తుంది. ఈ అధునాతన వ్యవస్థ ద్వారా దరఖాస్తుదారుల తనిఖీ ఆటోమేటిక్ గా పూర్తవుతుంది. అలాగే దరఖాస్తులను ఆమోదించే విషయంలో జియో ట్యాగింగ్‌తో కూడిన ఫొటోలు పూర్తి పారదర్శకతను అందిస్తాయి.

దీనికి తోడు క్షేత్రస్థాయి అధికారులు మూడు స్థాయిల్లో ఆయా దరఖాస్తులను పునఃపరిశీలన చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్, మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇది పారదర్శకతను పెంచుతుంది. అర్హత లేనివారి దరఖాస్తులను వందశాతం ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఆవాస్ ప్లస్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన స్థలం, ప్రస్తుత నివాస ఫొటోలను AI చెకర్ టూల్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పునాది దశ, గోడల నిర్మాణం, సిమెంట్ ప్లాస్టింగ్, స్లాబ్ వేయడం, పూర్తి స్థాయి నిర్మాణం వంటి దశలను విశ్లేషిస్తుంది.
నిర్మాణం 80 శాతం కంటే ఎక్కువగా పూర్తయిందని గుర్తించినట్లయితే, ఆ దరఖాస్తులను అనర్హుల జాబితాలోకి చేర్చుతారు. తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర అధికారులకు పునఃపరిశీలనకు వాటిని పంపిస్తారు. దీని ద్వారా నకిలీ దరఖాస్తులను సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. సొంత స్థలం ఉండటం తప్పనిసరి కానప్పటికీ, దరఖాస్తుదారుకు పక్కా ఇల్లు ఉండకూడదు.
నిరాశ్రయులైన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారులు ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం అవసరం. దరఖాస్తుకు జత చేయాల్సిన డాక్యుమెంట్లల్లో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ల్యాండ్ డాక్యుమెంట్, బ్యాంక్ పాస్‌బుక్, ఫొటోలు.. ఉన్నాయి. ఈ పత్రాలను గ్రామ సచివాలయంలో అందజేయాలి. దీని తర్వాత జియో-ట్యాగింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అనంతరం ఆన్‌లైన్ ఎంట్రీని పూర్తి చేస్తారు. పునాది, స్లాబ్.. వంటి దశలవారీగా నిధులు విడుదల అవుతాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications