Children's day special: చాచా నెహ్రూ జన్మదినం.. బాలలకు పర్వదినం; నవంబర్ 14 నే చిల్డ్రన్స్ డే ఎందుకంటే!!
నవంబర్ 14 వచ్చిందంటే చాలు పిల్లల్లో ఎనలేని ఉత్సాహం, చెప్పలేని సంతోషం కొట్టొచ్చినట్లు కనబడతాయి. ఎందుకంటే ఆరోజు చిన్నారులకు ఇష్టమైన రోజు. బాలలకు ప్రత్యేకమైన రోజు. చిన్న పిల్లలు అంటే అమితమైన ప్రేమ చూపించే చాచా నెహ్రూ పుట్టినరోజు. భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకొనే పండుగ రోజు.

భారత దేశంలో నవంబర్ 14 న బాలల దినోత్సవం జరుపుకోవటంలో విశేషం
ప్రపంచంలో చాలా దేశాలు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఆరు రోజుల ముందుగా నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే నిర్వహించుకుంటారు. అందుకు కారణం భారత దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ నవంబర్ 14 వ తేదీన జన్మించడం. దేశం కోసం ఎంతో సేవ చేసిన, ఎన్నో త్యాగాలు చేసిన జవహర్ లాల్ నెహ్రూ జన్మించిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడంలో ఒక విశేషం ఉంది.

చాచా నెహ్రూ ... పిల్లలను అమితంగా ఇష్టపడే భారత తొలి ప్రధాని
స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్ని, స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన దార్శనికత, ఆయన ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేస్తాయి. పండిట్ నెహ్రూ పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రు అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వుల ను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారు.

నెహ్రూ మరణం తర్వాత నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే
దేశ స్వాతంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి, బ్రిటిష్ పాలకులు వెళ్లిపోయిన తరువాత భారతదేశ అభ్యున్నతికి ఎంతగానో సేవలందించిన పండిట్ నెహ్రూ 1964వ సంవత్సరంలో మరణించారు .ఆయన మరణించిన తరువాత ఆయనకు గౌరవంగా నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది .ఇక అప్పటి నుండి నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే ను జరుపుకుంటున్నాం. అంతకు ముందు భారత దేశంలో కూడా చిల్డ్రన్స్ డే నవంబర్ 20వ తేదీన జరుపుకునేవారు.

భారత్ తప్ప ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలలో నవంబర్ 20న చిల్డ్రన్స్ డే
నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. ఆ తీర్మానం మేరకే ఐక్యరాజ్య సమితి సభ్య దేశం అయిన భారతదేశంలో కూడా నెహ్రూ మరణానికి ముందు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కానీ నెహ్రూ మరణం తర్వాత నుండి ఇప్పటివరకు నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇక బాలల దినోత్సవం వచ్చిందంటే చాలు స్కూళ్లలో హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతి స్కూల్లోనూ ఒక పండుగ వాతావరణం ఉంటుంది.

బాలల దినోత్సవం .. స్కూల్స్ లో పండుగ వాతావరణం
పిల్లలకు, చాక్లెట్లు బిస్కెట్లు తో పాటుగా ఇతర బహుమతులను పంచిపెట్టడం, సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడం,బాలల దినోత్సవం నాడు పిల్లలు సంతోషంగా ఉండేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం చేస్తారు. పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లు నిర్వహిస్తారు. బుజ్జి బుజ్జి బుడతళ్ళు టీచర్లుగా ,పోలీసులుగా, రకరకాల గెటప్ లలో సందడి చేస్తారు. కల్లాకపటం తెలియని బాల్యం, వారి అమాయకత్వం చూడటానికి ముచ్చటగా అనిపిస్తుంది .

చాచా నెహ్రూ సూక్తులతో , మిఠాయిలతో బాలల దినోత్సవం జరుపుకోండి
భరతమాత ముద్దుబిడ్డలు బాలలు , నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి బాలల జీవితం సంతోషంగా సాగాలి. బాలలు సక్రమమైన మార్గంలో పెరగడానికి, వారి అందమైన బాల్యం ఆహ్లాదంగా, ఆనందంగా కొనసాగడానికి బాలల దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరింకెందుకాలస్యం బాలల దినోత్సవం రోజు పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి, చాక్లెట్లు, స్వీట్లు పంచి చాచా నెహ్రూ చెప్పిన సూక్తులను వారికి వంటబట్టిస్తే సరి. దేశం గర్వపడే భావి భారత పౌరులుగా బాలలు ఎదుగుతారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications