బాలయ్యతో KGF ను మించిన యాక్షన్ డ్రామా.. 2 భాగాలుగా తొలిసారి

టాలీవుడ్ 'గాడ్ ఆఫ్ మాస్' నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథల దర్శకుడు వివేక్ ఆత్రేయ.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందని వినగానే ఫ్యాన్స్‌లో ఏదో తెలియని వైబ్రేషన్ మొదలైంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ను, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరైన వివేక్ ఆత్రేయ ఎలా చూపిస్తారా? ఎటువంటి కథను ఎంచుకున్నారా? అనే ఉత్కంఠ అభిమానుల్లోనే కాదు.. ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఒకే భాగంలో కాకుండా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత, దర్శకులు, హీరో నిర్ణయించారు.

పౌరాణిక టచ్ ఉంటుందా?

వివేక్ ఆత్రేయ సిద్ధం చేసిన కథా పరిధి చాలా పెద్దదని, అందులోని ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కేవలం మూడు గంటల్లో కుదించడం సాధ్యం కాదని చిత్ర యూనిట్ భావిస్తోంది. కథలో ఉన్న దమ్మును, పాత్రలోని లోతును గమనించిన బాలయ్య.. రెండు భాగాలుగా తెరకెక్కించే ప్రతిపాదనకు తక్షణమే అంగీకరించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాకు 'కురుక్షేత్రం' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ పేరు వినగానే బాలయ్య మార్క్ పౌరాణిక టచ్ ఉన్న సోషల్ డ్రామా ఏదో రాబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

An Action Drama Surpassing KGF with Balayya Released in Two Parts for the First Time

కొద్దిరోజులు వేచిచూస్తే చాలు

షూటింగ్ విషయంలో బాలకృష్ణ ఒక స్పష్టమైన వ్యూహాన్ని దర్శకుడి ముందుంచారు. రెండు భాగాల చిత్రీకరణను ఒకేసారి లేదా చాలా తక్కువ గ్యాప్‌లో పూర్తి చేయాలని బాలయ్య సూచించారు. దీనివల్ల నటీనటుల లుక్స్ మారకుండా ఉండటమే కాకుండా, అవుట్‌పుట్ విషయంలో క్లారిటీ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. బాలయ్య సూచనకు వివేక్ కూడా అంగీకరించారు. విజయ దశమి తర్వాత ఏరోజైనా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. షెడ్యూల్సనీ పక్కా ప్రణాళికతో ఆత్రేయ సిద్ధం చేసుకుంటున్నారు. బాలకృష్ణ క్రేజ్‌కు వివేక్ ఆత్రేయ మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, వివేక్ ఆత్రేయ స్టైల్ లో ఉండే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఈ 'కురుక్షేత్రం' బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+