Chandrahaas controversy: వామ్మో..చంద్రహాస్‌కు మూడినట్లే..రంగంలోకి ఆ మేడం..!!
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ... సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన పాటే కాంట్రవర్శీ క్రియేట్ చేసింది.దీనిపై పలువురు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఒక ప్రముఖ జర్నలిస్టు ఆ వీడియోపై తన వ్యక్తిగత అభిప్రాయం తెలపడం ఆ తర్వాత చంద్రహాస్ దానికి రియాక్ట్ అవుతూ అమర్యాదగా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేయడంతో ఈ ఎపిసోడ్ మరో ట్విస్ట్ తీసుకుంది. అనంతరం జర్నలిస్టు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో చంద్రహాస్ పై ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయింది. తాజాగా చంద్రహాస్ పై కాంగ్రెస్ మహిళా నేత సంధ్యా రెడ్డి కూడా స్పందించారు.
శివాజీ అనసూయ ఎపిసోడ్‌లో...
ప్రముఖ నటుడు శివాజీ - అనసూయ మధ్య జరిగిన హీరోయిన్ల బట్టల కాంట్రవర్శీలో వారిద్దరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు కాంగ్రెస్ మహిళా నేత సంధ్యా రెడ్డి. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ మాట్లాడిన మాటలను ఒక్కింత సమర్థిస్తూనే..శివాజీకి కౌంటర్ వేసిన యాంకర్ అనసూయను మాత్రం సంధ్యారెడ్డి వెంటాడింది. ఆమె మాటలు చాలా అభ్యంతకరంగా ఉన్యాయంటూ పలు టీవీ ఛానెల్స్‌లో డిబేట్స్‌తో హోరెత్తించింది. అంతేకాదు సోషల్ మీడియాలో సంధ్యారెడ్డి యమ ఫాస్ట్‌గా పాపులర్ అయ్యారు. తనదైన శైలిలో ఒక సమస్యపై మాట్లాడి చాలామంది మద్దతును కూడగట్టుకున్నారు సంధ్యారెడ్డి.

చంద్రహాస్ ఎపిసోడ్‌లో సంధ్యా రెడ్డి
తాజాగా చంద్రహాస్ ఎపిసోడ్‌లో కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు సంధ్యా రెడ్డి.ఈటీవీ ప్రభాకర్ ఎంతో కష్ట పడి ఆ స్థాయికి వచ్చాడని.. తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారని సంధ్యా రెడ్డి అన్నారు. అలాంటి ఆయన పేరును చెడగొట్టొద్దని చంద్రహాస్‌కు చురకలంటించారు. డబ్బు ఉందనే గర్వం ఉండకూడదని.. నేటి తరం హీరోలు ఎలా ఉన్నారో చూసి నేర్చుకోవాలని చంద్రహాస్‌కు ఆమె సలహా ఇచ్చారు. రాంచరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎవరూ ఇంత హంగామా చేయలేదని గుర్తుచేశారు. చంద్రహాస్ మరి ఇంతలా రెచ్చిపోవడాన్ని, స్టేజ్ పై భూతు పాటను అందుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజానికి మంచిని పంచే సినిమాలు లేదా మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తే బాగుంటుందని సంధ్యా రెడ్డి అభిప్రాయపడ్డారు.
కావాలనే కాంట్రవర్శీ..
జర్నలిస్టులు మీద కేసులు పెడతాం.. ఇంకెవరిమీదనో కేసులు పెడతామంటే ఎవరికీ నష్టం జరగదని చంద్రహాస్‌కే అది తీవ్ర నష్టం చేకూర్చుతుందని సంధ్యారెడ్డి అన్నారు. సమాజం మీద బాధ్యత ఉండాలని పిలుపునిచ్చారు.ఇదంతా చూస్తే కాంట్రవర్శీతోనే ఫ్రీ పబ్లిసిటీ కోసం చేసినట్లుగా తనకు అనిపించిందని సంధ్యారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే చంద్రహాస్ కావాలనే కాంట్రవర్శీ క్రియేట్ చేయడం కోసమే చేసినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంత నెగిటివ్ ప్రచారం జరిగితే అంత ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుందన్న ఆలోచన నుంచి ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలు బయట పడాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications