Chandrahaas: ఒకట్రెండు సినిమాలకే తోపనుకుంటే ఎలా బ్రో...కొంచెం అతి తగ్గించు..!!

చంద్రహాస్...ఈ పేరు చెబితే టక్కున ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే కొంతమంది గుర్తుపడతారేమో. ఇక స్మాల్ స్క్రీన్ స్టార్ ఈటీవీ ప్రభాకర్ కుమారుడు అ అప్పుడుగానీ ఇతగాడిని హీరోగా గుర్తించరు. అది ఇతని రేంజ్. ఏదో ఒకటి రెండు సినిమాల్లో కెమెరా ముందు కనిపించగానే తానేదో పెద్ద స్టార్ అయ్యాడనే ఫీలింగ్‌లో మనోడున్నాడు. వాస్తవానికి అంత బొమ్మలేదు.ఏదో తండ్రి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో అడుగెట్టామా...సొంత స్టామినా ఎలా బిల్డ్ చేసుకోవాలనేదానిపై ఫోకస్ చేయాలి గానీ... రాడం రాడమే బిల్డప్ ఇస్తే...మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రహాస్ విషయంలో కూడా ఇదే సరిగ్గా జరిగింది.

బూతుపాటతో ఛీ..ఛీ..

ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ రెండ్రోజుల నుంచి హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. హెడ్ లైన్స్‌లో నిలుస్తున్నాడంటే ఏదో గొప్పపని చేసి కాదండోయ్.. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బరాబర్ బూతు పాట పాడి సోషల్ మీడియాలో అందరితో ఛీ కొట్టించుకుంటున్నాడు. తండ్రి ప్రభాకర్‌కు ఇండస్ట్రీలో ఓ మంచి పేరుంది. ఇతగాడు చెడగొట్టేలా ఉన్నాడే అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్ అని చెప్పి బూతు పాట పాడటం ఏంట్రా బాబు అని ఓ ప్రముఖ జర్నలిస్టు వీడియో ద్వారా కడిగిపారేశాడు.ఈ వీడియోను చూసిన చంద్రహాస్ కూడా తనపేరుకు ముందు ఉండే యాటిట్యూడ్‌ను ఈ జర్నలిస్టుపై ప్రదర్శించాడు. దీంతో మ్యాటర్ కాస్త సీరియస్ అయ్యింది. తన లాయర్లతో లీగల్‌గా జర్నలిస్టుపై కేసు వేస్తానని..ఇంకా ఏదేదో మాట్లాడాడు.బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో ఈ ఆవేశం స్టార్ అష్టకష్టాల్లో చిక్కుకున్నాడు.

chandrahaas-the-attitude-star-in-trouble-police-complaints-filed-over-vulgar-song-journalist-clash

చంద్రహాస్ పై కేసులు నమోదు

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో లైవ్‌లో ఓ బూతుపాట అందుకున్నాడు. బ్రదర్‌కు మెచ్యూరిటీ లెవెల్స్ లేవని చాలామందికి అర్థమైంది. ఎక్కడ ఎలా ఉండాలో తెలీదంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా కన్నెర్ర చేశారు. ఇక ఏంటి మాకు ఈ చెండాలం అంటూ ప్రశ్నించిన జర్నలిస్టుకు 24 గంటలు సమయం ఇస్తున్నట్లు, సారీ చెప్పాలని బెదిరింపులకు పాల్పడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు చంద్రహాస్. ఇక సదరు జర్నలిస్టు కూడా చంద్రహాస్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో BNS 296, 296(A), 296 (B),351(2),67 ఐటీ చట్టం కింద పోలీసులు పలు కేసులు బుక్ చేశారు.

తోపు అనుకుంటే ఎలా బ్రదర్

ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు చేయగానే తోపు అనుకుంటే ఎలా బ్రదర్ అంటూ కొందరు నెటిజెన్లు చంద్రహాస్ పై మాటల కత్తులు నూరుతున్నారు. ఇండస్ట్రీలో ఇంత యాటిట్యూడ్ పనికిరాదని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌ రోజున చంద్రహాస్ వినిపించిన ఆ బూతు పాటతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోవాలనిపించిందని ప్రమఖ నటుడు జేడీ చక్రవర్తి కూడా చెప్పాడు. మహిళలు, పిల్లలు హాజరైన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వెకిలి పాటలేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాంట్రవర్శీతోనే పబ్లిసిటీ వస్తుందని, నెగిటివ్ ప్రచారంతోనే తనకు గుర్తింపు వస్తుందని బహుశా చంద్రహాస్ భావిస్తున్నట్లయితే.. అతన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తండ్రి ప్రభాకర్‌దే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఒక బూతు పాట పాడి ఏదో పాపులర్ అవుదామని ట్రై చేస్తే అది మిస్ ఫైర్ అయ్యిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. టాలెంట్ లేకపోతేనే ఇలాంటి ఎక్స్‌ట్రాలు బయటపడుతుంటాయని ఫిలింనగర్‌లో బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+