13 ఏళ్లుగా హిట్ లేదు.. ఏడేళ్లుగా సినిమాల్లేవు.. కానీ ఈ నటి ఆస్తి రూ. 4,600 కోట్లు!

సినీ ఇండస్ట్రీలో ఓ నటి పదేళ్ల పాటు ఫామ్‌లో ఉండటమే గొప్ప విషయం. అలాంటిది 13 ఏళ్లగా ఒక్క హిట్ కూడా లేకపోయినా.. గత ఏడేళ్లుగా వెండితెరపై కనిపించకపోయినా.. ఇండియాలోని అత్యంత రిచెస్ట్ నటీమణుల జాబితాలో ఒకరు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బాక్సాఫీస్ లెక్కలకు అందనంత భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆ నటి మరెవరో కాదు.. అందాల తార జుహీ చావ్లా.

జుహ్లీ చావ్లా సినీ ప్రస్థానం ఇలా..
జుహీ చావ్లా 1986లో ధర్మేంద్ర సరసన 'సుల్తానాత్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అయితే 1988లో అమీర్ ఖాన్ సరసన నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలోని "ఏ మేరే హమ్ సఫర్" వంటి పాటలు నేటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆమె రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో కూడా నటించి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు.

Juhi Chawla Rs 4 600 Crore Empire India Richest Actress and Her Business Success Story Full Details

హిట్ లేకపోయినా ఇన్ని కోట్లు ఎలా?
గత 13 ఏళ్లుగా జూహీ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు హిట్ కాలేదు. ఎక్కువగా అతిథి పాత్రలకే పరిమితమయ్యారు. అయినప్పటికీ.. 2024-25 హురున్ రిచ్ లిస్ట్ (Hurun Rich List) ప్రకారం ఆమె నికర ఆస్తి విలువ అక్షరాలా రూ. 4,600 కోట్లు. సినిమాల ద్వారా కాకుండా తెలివైన వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. జుహీ చావ్లా సంపదలో మెజారిటీ భాగం క్రీడల నుంచే వస్తోంది. షారుఖ్ ఖాన్‌తో ఉన్న విడదీయరాని స్నేహంతో, ఆమె ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో సహ యజమానిగా ఉన్నారు. నివేదికల ప్రకారం ఆమె ఈ ఫ్రాంచైజీలో రూ. 623 కోట్లు పెట్టుబడి పెట్టారు. నేడు ఫోర్బ్స్ లెక్కల ప్రకారం కేకేఆర్ విలువ దాదాపు రూ. 9,139 కోట్లు.

ఇతర వ్యాపార పెట్టుబడులు
జుహీ చావ్లా ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట ఉన్న షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లో ఆమెకు వాటా ఉంది. సౌరాష్ట్ర సిమెంట్ కంపెనీలో జుహీ చావ్లా 0.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. ముంబై, గుజరాత్‌లో అత్యంత ఖరీదైన విలాసవంతమైన బంగళాలు ఆమె సొంతం.ముంబైలో రెండు ప్రముఖ రెస్టారెంట్లను నడుపుతున్నారు.

విలాసవంతమైన కార్ల కలెక్షన్:
జూహీ చావ్లా గ్యారేజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్లు ఉన్నాయి. అవి ఏంటంటే?

*ఆస్టన్ మార్టిన్ రాపిడ్: రూ. 3.3 కోట్లు

*BMW 7-సిరీస్: రూ. 1.8 కోట్లు

*మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్: రూ. 1.7 కోట్లు

*పోర్షే కయెన్: రూ. 2 కోట్లు

కెరీర్ కోసం రహస్య వివాహం
ఒకప్పుడు తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వ్యాపారవేత్త జయ్ మెహతాతో పెళ్లిని ఆమె రహస్యంగా ఉంచారు. కెరీర్ దెబ్బతింటుందనే భయంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఇటీవల వెల్లడించారు. అంతేకాదు టీవీలో సూపర్ హిట్ అయిన బి.ఆర్ చోప్రా 'మహాభారత్'లో ద్రౌపది పాత్రకు మొదట జూహీ చావ్లానే ఎంపికయ్యారు. కానీ సినిమాల బిజీ వల్ల ఆమె ఆ పాత్రను వదులుకున్నారు. సినిమాల్లో రాణించడమే కాకుండా, వచ్చిన సంపాదనను సరైన చోట పెట్టుబడిగా పెడితే ఎంతటి సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చో జూహీ చావ్లా నిరూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+