హొంబలే ఫిల్మ్స్ మైథలాజికల్ థ్రిల్లర్

మహావతార్ నరసింహ.. ఇప్పట్లో మరిచిపోలేని సినిమా ఇది. కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టుకున్న ఓ యానిమేటెడ్ ఫిల్మ్. థియేటర్లలో ఓ ఫుల్ లెంగ్త్ యానిమేటెడ్ మూవీ ఈ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం చాలా చాలా అరుదు. పురాణగాథ భక్త ప్రహ్లాదుడు- హిరణ్యకశిపుడు- నరసింహ స్వామి ఎపిసోడ్ ఆధారంగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 300 కోట్లను కలెక్ట్ చేసింది. ప్రేక్షకులు గ్రాఫిక్స్ ఫిదా అయ్యారు.

2025లో ఏడవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.. మహావతార్ నరసింహ. 2014 విడుదలైన కోచ్చడయాన్, 2019 నాటి ది లయన్ కింగ్ ను అధిగమించింది. అశ్విన్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించారు. జయపూర్ణ దాస్ కథను సమకూర్చారు. క్లీమ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. హోంబలే ఫిలిమ్స్ దీన్ని సమర్పించింది. 2024 నవంబర్ 25న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది.

Hombale Films Unveils Mahavatar Parshuram The Next Epic in the Mahavatar Cinematic Universe

ఈ ఫిల్మ్ ఇచ్చిన భారీ సక్సెస్ తో ఇప్పుడు మరో యానిమేటెడ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. దీని టైటిల్.. మహావతార్ పరశురామ్. పరశురామ జయంతిని పురస్కరించుకుని హొంబలే ఫిల్మ్స్ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది. భారతీయ పౌరాణిక కథలను ఆధునిక శైలిలో అందించే 'మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా 'మహావతార్ పరశురామ్' తెరకెక్కుతోంది. 'మహావతార్ నరసింహ'తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న అభిమానులు, ఇప్పుడు 'పరశురామ్' ప్రకటనతో మరింత ఉత్సాహంగా ఉన్నారు.

దీనికి దర్శకుడు అశ్విన్ కుమార్. తొలి పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. పోస్టర్‌లో- యుద్ధభూమి మధ్య నిలబడిన ఓ ఉగ్ర యోధుడు, అతని చేతిలో రక్తసిక్తమైన భారీ గండ్రగొడ్డలి కనిపించింది. హోంబలే ఫిలిమ్స్ పోస్టర్‌ను విడుదల చేస్తూ "ధర్మం పతనమైనప్పుడు, 'పరశువు' (గండ్రగొడ్డలి) ఉదయిస్తుంది. ఆ యోధుడు పాలకుడు మాత్రమే కాదు, అధర్మంపై సంధించిన ఓ పరాక్రముడు.." అని పేర్కొంది.

ఈ యానిమేటెడ్ ఫిల్మ్ 2027 డిసెంబర్ లో థియేటర్లలో విడుదల కానుంది. భారతీయ యానిమేషన్ స్థాయిని పెంచేందుకు హోంబలే ఫిలిమ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ 12 సంవత్సరాల మెగా ప్రణాళికను సిద్ధం చేశాయి. ఇందులో శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఆధారపడిన మొత్తం ఏడు 3డీ చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయి. 2025లో వచ్చిన 'మహావతార్ నరసింహ'తో మొదలైన ఈ ప్రయత్నం.. యానిమేషన్ పట్ల ప్రజల దృక్పథాన్ని సమూలంగా మార్చివేసింది. ఇలాక్కూడా తీయవచ్చా అనే ఆలోచనను రేకెత్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+