ఏఆర్ రెహమాన్ ఇస్లాం లోకి మారడానికి ఆ ఒక్క ఘటనే కారణమా..?
భారతీయ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు "ఏఆర్ రెహమాన్". ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తనదైన శైలిలో సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసి ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1992లో 'రోజా' సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ఆయన.. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించి, సంగీత రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు.
తన కెరీర్ లో 19 ఫిలింఫేర్ అవార్డులు, నాలుగు జాతీయ పురస్కారాలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్టా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం, రెండు ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడుగా కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఇన్నాళ్ల తన కెరీర్ లో వివాదాలకు పెద్దగా తావు ఇవ్వని ఏఆర్ రెహమాన్.. పర్సనల్ లైఫ్ కారణంగా మాత్రం వార్తల్లో నిలిచారు.

రెహమాన్ వ్యక్తిగతంగా వార్తల్లో నిలిచేలా చేసిన విషయాలు అంటే ముఖ్యంగా రెండు ఉన్నాయని చెప్పొచ్చు. అందులో ఒకటి ఆయన విడాకులు అయితే.. మరొకటి హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారడం. ఈ వ్యవహారాల్లో రెహమాన్ హాట్ టాపిక్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలపై ఓపెన్ అయ్యారు. దీంతో మరోసారి ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
విడాకుల ఇష్యూ..
రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే 29 ఏళ్లు వారి వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతూ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకుని విడిపోయారు.
హిందూ టూ ముస్లిం..
ఇక ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. అయితే తన తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతున్న చివరి రోజుల్లో ఒక సూఫీ సాధువు ఆయనకు చికిత్స చేశారట. సూఫీయిజం మార్గంలో ఎవరినీ మతం మార్చుకోమని బలవంతం చేయరని.. అది వారికి హృదయపూర్వకంగా నచ్చినప్పుడే అనుసరిస్తారని తెలిపారు. ఆ సమయంలో సూఫీ మార్గం తనకు ఉత్తమ మార్గం అని అనిపించిందని.. అందుకే ఇస్లాంను స్వీకరించినట్టు వెల్లడించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications