తెలుగులో టీఆర్పీ రేటింగ్‌లో నెం.1 సినిమా ఇదే
వెండితెరపై బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఒక్కోసారి మాత్రం అనూహ్యంగా వెనకబడతాయి. అలా ఎందుకు జరుగుతుందో సినీ పండితులంతా తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. చిత్రంగా వెండితెరపై ఫ్లాప్ అయిన సినిమాలు బుల్లితెరపై సంచనాలు సృష్టిస్తుంటాయి. అందుకు ఉదాహరణ మహేష్ బాబు ఖలేజా సినిమా. అలా ఒకచోట ఆకట్టుకున్నవి మరో చోట ఆకట్టుకోలేవు. రెండుచోట్లా ఆకట్టుకునేవి కొన్ని ఉంటాయి. ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా నిలిచింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం రెండో స్థానంలో నిలిచింది. ఏయే హీరోల సినిమా అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించాయనే వివరాలను తెలుసుకుందాం.
రెండో స్థానంలో అల వైకుంఠపురం
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన 'టెంపర్' చిత్రం బుల్లితెరపై సరికొత్త చరిత్రను సృష్టించింది. మొదటిసారి టీవీలో ప్రసారమైనప్పుడు ఈ సినిమా ఏకంగా 29.9 టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టి, టాలీవుడ్‌లో ఆల్-టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అల వైకుంఠపురములో' చిత్రం 29.4 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా త్రుటిలో ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన 'మగధీర' 24 రేటింగ్‌తో మూడో స్థానం, పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' కూడా అదే 24 పాయింట్లతో మూడో స్థానంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' 23.4 రేటింగ్‌తో నాలుగో స్థానంలో, ప్రభాస్ నటించిన విజువల్ వండర్ 'బాహుబలి 2' 22.7 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాయి.

10వ స్థానంలో గీత గోవిందం
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' 22.54 టీఆర్పీని నమోదు చేసి ఆరో స్థానంలో నిలవగా, అల్లు అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ 'దువ్వాడ జగన్నాథం' 21.7 రేటింగ్‌తో ఏడో స్థానంలో, బాహుబలి మొదటి భాగం 21.54 రేటింగ్‌తో 8వ స్థానంలో, వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఫిదా' 21.31 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారిగా నటించిన బ్లాక్ బస్టర్ 'గీత గోవిందం' 20.8 రేటింగ్‌తో పదో స్థానాన్ని దక్కించుకుంది.












Click it and Unblock the Notifications