అల్లు అర్జున్‌కు ఒక్క హైదరాబాద్‌లోనే ఎన్ని లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాకుండా, వ్యాపారాల్లో తెలివైన పెట్టుబడులు పెట్టడంద్వారా కూడా అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పొచ్చు. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును హైదరాబాద్ నగరంలోనే పెట్టుబడి పెడుతున్నారు. స్థిరాస్తి వ్యాపారాల్లో, ఇతర వెంచర్లలో పెడుతున్నారు. వీటివల్ల వచ్చే ఆదాయంతో కుబేరుడిగా మారుతున్నారు. 2026 సంవత్సరానికి అధికారికంగా రూ.700 కోట్ల ఆస్తి అల్లు అర్జున్ కు ఉంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 6 లగ్జరీ ఆస్తులను బన్నీ కలిగివున్నారు.

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ నిర్మించుకున్న ఇల్లు చాలా బాగుంటుంది. దాదాపు రూ. 100 కోట్ల విలువ చేసే ఈ లగ్జరీ మ్యాన్షన్, తెల్లటి రంగులో ధగధగలాడిపోతుంటుంది. ఇంటి బయట భారీ లాన్, స్విమ్మింగ్ పూల్, ఇంటి గోడలపై ఉండే 'AA' లోగో ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఇంటిని మోడర్న్ ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్ గా అభివర్ణిస్తారు.

Tollywood Do you know how many luxury properties Icon Star Allu Arjun owns in Hyderabad alone

అల్లు అర్జున్ బిజినెస్ మైండ్‌కు నిదర్శనం కోకాపేటలోని అల్లు స్టూడియోస్ లోపల నిర్మించిన 'అల్లు సినిమాస్'. ఇది భారతదేశంలోనే 75 అడుగుల అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 3D ప్రొజెక్షన్, అడ్వాన్స్‌డ్ సౌండ్ టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్, హైదరాబాద్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్ళబోతోందని చెప్పొచ్చు.

ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని అమీర్‌పేటలో AAA సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను బన్నీ నడుపుతున్నారు. 2023లో ప్రారంభమైన ఈ థియేటర్, లగ్జరీ సీటింగ్, హై-ఎండ్ టెక్నాలజీతో ఉంటుంది. హీరోగానే కాకుండా ఎగ్జిబిషన్ రంగంలో కూడా తన ముద్ర ఉండాలనేది బన్నీ ప్లాన్.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో బన్నీకి ఒక గెస్ట్ హౌస్ ఉంది. రూ. 6 నుంచి రూ. 8 కోట్ల విలువ చేసే ఈ ప్రాపర్టీని, నగరం నుంచి దూరంగా, ప్రశాంతత కోసం నిర్మించుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలుసుకొని వారాంతపు పార్టీలు చేసుకోవడానికి ఇది ఒక వేదికలా నిలుస్తోంది.

బన్నీ ఆస్తుల్లో అత్యంత చర్చనీయాంశమైనదేంటంటే.. ఆయన వ్యాన్ 'ఫాల్కన్'. రూ. 7 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ వ్యాన్, లోపల ఒక లగ్జరీ సూట్ రూమ్‌ను తలపిస్తుంది. సిల్వర్, బ్లాక్ థీమ్‌తో ఉండే దీని ఇంటీరియర్స్ చూస్తే ఎవరికైనా మతిపోతుంది. షూటింగ్ సెట్స్‌లో ఇది అల్లు అర్జున్ కు వ్యక్తిగతంగా ఇంటిలాంటిది.

అల్లు అర్జున్ కార్ కలెక్షన్‌లో బ్లాక్ రేంజ్ రోవర్. దీనికి ఆయన ముద్దుగా 'బీస్ట్' అని పేరు పెట్టుకున్నారు. విలువ రూ. 2.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా ఈ నల్లటి 'బీస్ట్' లోనే ఐకాన్ స్టార్ దర్శనమిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+