తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు
తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు రావడం, అవి బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక నిర్మాతలను పూర్తిగా ముంచేయడం కొత్తగా జరుగుతున్నదేం కాదు. కాస్తో కూస్తూ ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే మొత్తంతో సర్దుకుపోతున్నారు. లేదంటే ఆ డబ్బులను వడ్డీలు కట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. పాన్ ఇండియా మోజులో పడి వందల కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు నిర్మించి కొందరు పరిశ్రమ నుంచే కనుమరుగయ్యారు. మరికొందరు వేలాడుతూ ఉన్నారు. భారీ డిజాస్టర్లుగా నిలిచి, నిర్మాతలను, బయ్యర్లను, ఎగ్జిబిటర్లను నిలువునా ముంచేసిన టాప్-5 చిత్రాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది. కథలో బలం లేకపోవడం, నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే వల్ల డిస్ట్రిబ్యూటర్లకు సుమారు రూ.80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. దీంతో చిరంజీవి, కొరటాల శివ స్వయంగా కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చి నష్టపరిహారం చెల్లించారు. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో వేదికపై చిరంజీవి, కొరటాల శివపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు.

రాధేశ్యామ్
ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన 'రాధేశ్యామ్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నా, కథలో ఎమోషన్ లేకపోవడం పెద్ద మైనస్. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా దారుణంగా దెబ్బతిన్నది. బాహుబలి ఇమేజ్ తర్వాత వచ్చిన సినిమా అయినా రూ.100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.

రాజాసాబ్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రంపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. విడుదలైన తర్వాత అవన్నీ తుస్సుమన్నాయి. నిర్మాణ సమయంలో జరిగిన జాప్యంవల్ల బడ్జెట్ పెరిగింది. ఈ హారర్ కామెడీ చిత్రం నిర్మాతలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. భారీ రెమ్యూనరేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం చేసిన ఖర్చు బయ్యర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. రూ.450 కోట్ల బడ్జెట్ పెడితే రూ.208 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మారుతిని నమ్ముకొని అందరూ మునిగిపోయారు.

ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం భారీ హైప్‌తో మొదలైంది. తమిళ హిట్ 'తేరి'కి రీమేక్ కావడం, రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైంది. ఆ ప్రభావం సినిమాపై పడింది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌ను నమ్ముకుని భారీ ధరలకు థియేట్రికల్ హక్కులు కొన్న వారంతా రోడ్డున పడ్డారు. ఇది విడుదలైన రోజే ధురంధర్2 కూడా విడుదలైంది. ప్రేక్షకులంతా అటుమొగ్గారు. సినిమా రెండువారాలు కూడా నిలబడలేక కోలుకోలేనంత నష్టాలను మిగుల్చింది. ఈ సినిమా దాదాపు రూ.80 నుంచి రూ.100 కోట్ల నష్టాలను మిగుల్చింది.
గేమ్ ఛేంజర్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఈ జాబితాలో భారీ నష్టాలను తెచ్చిన నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. మూడేళ్ల షూటింగ్, రూ.400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మాత దిల్ రాజు కుదేలయ్యారు. ఈ పొలిటికల్ త్రిల్లర్ శంకర్ మార్క్ లా లేదు. ప్రమోషన్స్ లేవు. పెట్టుబడిలో కనీసం 40 శాతం కూడా రికవరీ కాలేదంటే ఎంత దారుణమైన నష్టాల్లో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయి దిల్ రాజును నిలబెట్టిందికానీ లేదంటే అతను కూడా రోడ్డున పడే పరిస్థితిని ఈ సినిమా తీసుకొచ్చింది.
-
ప్రభాస్‌కు బాగా ఇష్టమైన బాలయ్య సినిమా ఏదో తెలుసా? -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications