ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కలెక్షన్లు ఇండస్ట్రీని షాక్ కు గురి చేస్తోన్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో వచ్చినా ఆశించిన స్థాయిలో హైప్ లభించలేదు. ఈ వారం ప్రారంభంలో కలెక్షన్లు డల్ గా ఓపెన్ అయ్యాయి. థియేటర్ల వద్ద సందడి నామమాత్రంగానే కనిపిస్తోంది. ఈ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోందనే టాక్ ఉంది.
పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ సూపర్ హిట్. దీని తర్వాత వచ్చినా గానీ ఉస్తాద్ పై ఎలాంటి సానుకూల ప్రభావం పడలేదు. ఓవర్సీస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చివరి నిమిషం వరకు బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిర్మాత స్వయంగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. ఓపెనింగ్స్ అత్యంత పేలవంగా నమోదయ్యాయి. విడుదలైన రెండో రోజు నుంచే అమెరికా థియేటర్లలో పాసులు యాక్టివేట్ అయ్యాయంటే కలెక్షన్ల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా స్టార్ హీరోలా సినిమాలకు తొలి వారం రోజులు ఎటువంటి పాస్ లను కూడా అలో చేయరక్కడ. టయర్-2, టయర్-3 హీరోల సినిమాలకు మాత్రమే ఓపెనింగ్ నుండీ పాసులకు అనుమతి ఇస్తారు. గ్రాస్ వసూళ్లు ఎంత నమోదైనా, పంపిణీదారులకు వాటా మొత్తం దాదాపు సున్నాకు పడిపోయిందని తెలుస్తోంది. హరి హర వీరమల్లు కంటే కూడా కలెక్షన్లు తక్కువగా ఉనాయని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఓ భారీ స్టార్ సినిమా ఇంత తక్కువ ప్రీమియర్ ఓపెనింగ్స్ సాధించడం ఇదే తొలిసారి.
దర్శకుడు హరీష్ శంకర్ సత్తా ఉన్న కమర్షియల్ డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచీ ఉత్సాహంగా ప్రమోషన్స్ చేశారు.అయినా గానీ సినిమాను గబ్బర్ సింగ్ స్థాయిలో సూపర్ హిట్ గా నిలపలేకపోయారు. ధురంధర్ 2: ది రివెంజ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ను విడుదల చేయడం ఓ కాస్ట్లీ మిస్టేక్ అయిందనే అభిప్రాయాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. నిజానికి- ఉస్తాద్ మూవీ ఈ నెల 26న విడుదల కావాల్సి ఉంది. ధురంధర్ తో పాటు విడుదల కావాల్సిన టాక్సిక్ వాయిదా పడటంతో ఇది ప్రీపోన్ అయింది. ధురంధర్ కు పోటీగా ఎంట్రీ ఇచ్చింది.
ఇది వసూళ్లను దెబ్బతీసిందనే వాదనలు కూడా ఉన్నాయి. ధురంధర్ పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. దాని సీక్వెల్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వచ్చారు ప్రేక్షకులు. అలాంటి సినిమాకు పోటీ ఉస్తాద్ ను దింపడం దాని కలెక్షన్లను చాలావరకు ప్రభావితం చేసినట్టయింది. ఓజీతో పవన్ కల్యాణ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం, ఉస్తాద్ దాన్ని అందుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసిందని అంటున్నారు.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications