విజయ్ ఆస్తులు, అతని భార్య సంగీత ఆస్తులు తెలుసుకుంటే మైండ్ బ్లాక్ !!
తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన విజయ్, ప్రస్తుతం తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. కేవలం సినిమా వర్గాల్లోనే కాకుండా, విజయ్ కొత్తగా ప్రారంభించిన 'తమిళగ వెట్రి కళగం' టీవీకే రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సంగీత ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. శ్రీలంకకు చెందిన తమిళ కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి, లండన్‌లో భారీస్థాయిలో ఎగుమతి - దిగుమతి వ్యాపారాలు చేస్తుంటారు. పెద్ద పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. విజయ్‌కు వీరాభిమాని అయిన సంగీత, 1996లో కేవలం ఆయన్ను కలవడానికి లండన్ నుంచి చెన్నైకి వచ్చారు. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. 1999లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో విజయ్ చిన్నగా ఎదుగుతున్న ఒక సాధారణ హీరో మాత్రమే. కానీ సంగీత అప్పటికే వందల కోట్ల సంపద కలిగిన ధనవంతురాలుగా ఉంది.

వందలకోట్లు సంగీతకే..
ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకు రూ. 200 కోట్ల నుండి రూ. 275 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 600 కోట్ల వరకు ఉంది. సంగీత కూడా తండ్రి నుండి వచ్చిన వ్యాపార సామ్రాజ్యం, సొంత పెట్టుబడుల ద్వారా సుమారు రూ. 400 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారు. ఆర్థికంగా ఆమె విజయ్‌పై ఏమాత్రం ఆధారపడకుండా మొదటి నుంచి స్వతంత్రంగా ఉంటోంది. ఇంతటి వైభవం ఉన్నా వారి బంధంలో విభేదాలు రావడం ఏమిటని అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు.
సంగీత తన విడాకుల పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2021 నుండి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారని, దానివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నారు. అంతేకాకుండా, గత రెండేళ్లుగా తాము విడిగా ఉంటున్నామని, తనపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించడంతో పాటు గృహ నిర్బంధానికి గురిచేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ కేసు విచారణకు రానుంది. కేసుకు విజయ్ కూడా రావాలని ఫ్యామిలీకోర్టు ఆదేశించింది.
చెన్నై నుంచి రామేశ్వరం వరకు చర్చ..
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న విజయ్‌కు, ఈ వివాదం పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కోరుతున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు రాజకీయంగా ఆయనకు ఇబ్బంది కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు విజయ్ - సంగీత ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఓ మహిళ కారణంగా ఈ జంట ఇలా కోర్టు మెట్లు ఎక్కడం అటు అభిమానులను, ఇటు సినీ ప్రముఖులను ఒకవైపు విస్మయానికి, మరోవైపు ఆవేదనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు అనేది తమిళనాడులో చెన్నై నుంచి రామేశ్వరం వరకు చర్చ నడుస్తోంది.
-
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications