డిబేట్ : మహర్షి సినిమా పేరుతో మహా దోపిడీపై మీ కామెంట్..?
రిలీజ్ కన్నా ముందే కొన్ని కారణాలతో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. ఏ సినిమాకు లేనంతగా మహేష్ బాబు మహర్షి సినిమాకు టికెట్ ధరలు విపరీతంగా పెంచేశాయి థియేటర్ యాజమాన్యాలు. ఓ వైపు ప్రభుత్వం టికెట్ ధరలు ఎక్కడా పెంచలేదని స్పష్టం చేస్తున్నప్పటికీ తెలంగాణలో 79 థియేటర్లలో యదేచ్ఛగా టికెట్ ధరలు పెంచేశాయి. మహర్షి చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించామని అందుకే టికెట్ ధరలు పెంచేందుకు కోర్టు అనుమతి తీసుకున్నామని ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు చెప్పారు.
ప్రభుత్వం అనుమతి లేకుండా టికెట్ ధరలు ఎలా పెంచుతారని దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని చెప్పారు. ఇప్పటికే టికెట్ ధరల పెంపుపై మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు చెబుతున్నట్లుగా భారీ బడ్జెట్ సినిమా అయితే టికెట్ ధరలు పెంచుకోవడం సబబేనా..? ప్రభుత్వం నిర్ణయాన్ని కాదని టికెట్ ధరలు పెంచడం న్యాయమేనా.. దీనిపై మీ కామెంట్ కింద రాయండి...













Click it and Unblock the Notifications