పరీక్ష లేకుండా ఎస్‌బీఐలో 150 ఉద్యోగాలు.. ఎంపికైతే జీతం రూ.69 వేలు!
ఎలాంటి పరీక్ష లేకుండా వేల రూపాయల వేతనంతో ప్రభుత్వ కొలువు సాధించాలనుకుంటున్నారా? అయితే, మీ కోసమే ఈ వార్త. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నియామల ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌తో మొత్తం 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారు హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో పని చేయాల్సి ఉంటుంది.
రెండేళ్ల అనుభవం తప్పనిసరి..
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పొంది ఉండాలి. దీంతోపాటు ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్, ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. ఈ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II: 150 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు, రుసుం చెల్లింపులకు 07.06.2024 నుంచి 27.06.2024 వరకు అవకాశం ఉంది.

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారి వయసు 31/12/2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రూ.750 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ సోస్టులకు పే స్కేల్ కూడా ఆశాజనకంగా ఉంది. ఎంపికైనవారికి పేస్కెల్ నెలకు రూ.48,170-రూ.69,810 వరకూ ఉంటుంది.












Click it and Unblock the Notifications