AHA Answer Key : యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆన్సర్ కీ విడుదల..
యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌కీ విడుదల అయ్యింది. ఎపీలోని పశుసంవర్థక శాఖలో యానిమల్ హస్బండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకీ రాతపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ విడుదలయ్యింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆన్సర్‌కీనీ ఉంచారు. కాబట్టి పరీక్షకు హాజరయిన అభ్యర్థులు వారి జవాబులను ఇందులో సరిచూసుకోగలను. ఈ ఆన్సర్‌కీ పై ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయగలరు.
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 ఉద్యోగాలను ఈ పోస్టుల కింద భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష డిసెంబర్ 31న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌కీను క్వశ్చన్‌పేపర్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు జవాబులు సరిచూసుకునేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ఆన్సర్‌కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు జనవరి 3 చివరితేదిగా వివరించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుదీ కీని విడుదల చేస్తారు.

ఈ పోస్టులకు ఎంపికయిన వారికి జనవరిలో నియామక పత్రాలు...
ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ పోస్టులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డిసెంబర్ 27 విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 31న రాతపరీక్షను నిర్వహించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. వీరికి నెలకు రూ.22,460- రూ.72,810 వరకూ వేతనం ఉంటుంది.
అభ్యంతరాల నమోదుకు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. https://apaha-recruitment.aptonline.in/Candidate/Objection
రాత పరీక్ష క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ కోసం https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/aha-key.pdf ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications