విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. సీబీఎస్ఈ టైమ్ టేబుల్ వ‌చ్చేసింది.. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ప‌రీక్ష‌లు..

ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. సీబీఎస్ఈ టైమ్ టేబుల్ వ‌చ్చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను ప‌ది, ప‌న్నెండోతరగతులకు సంబంధించిన పరీక్ష తేదీలను సీబీఎస్ఈ తాజాగా విడుద‌ల చేసింది. ఫిబ్రవరి 15, 2025 నుంచి ప‌ది, ప‌న్నెండో తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక‌, ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్‌కు 86 రోజుల ముందుగానే ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించారు.

ప్ర‌ధాన స‌బ్జెక్టుల‌కు ముందుగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప‌న్నెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మొద‌టి పేప‌ర్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఉంటుంది. అలాగే, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఇంగ్లీషు పేప‌ర్‌తో ప్రారంభంకానున్నాయి. ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మార్చి 18 వ‌ర‌కు జ‌రుగుతాయి. ఇక‌, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 4వ తేదివ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప‌రీక్షల షెడ్యూల్‌ను వెల్ల‌డించింది.

Alert for students CBSE time table has arrived Exams from February 15th

ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 10.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమ‌వుతాయి. ఈ సంద‌ర్భంగా పరీక్షా విధానం, సిలబస్‌లో ఎలాంటి మార్పుల్లేవ‌ని సీబీఎస్ఈ తెలిపింది. ఒక విద్యార్థికి సంబంధించిన రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే తేదీన జరగకుండా ప‌లు జాగ్రత్తలు తీసుకున్నట్లు సీబీఎస్సీ పేర్కొంది. సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై ఆన్‌లైన్‌లో వచ్చే పోస్టులను నమ్మొద్దని విద్యార్థులను కోరింది. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని మాత్ర‌మే ఆదారంగా తీసుకొవాల‌ని సూచించింది.

ప‌దో త‌ర‌గి పరీక్షల షెడ్యూల్‌..

2025 ఫిబ్రవరి 15వ తేది - ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ / ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్
ఫిబ్రవరి 20వ తేది - సైన్స్
ఫిబ్రవరి 22వ తేది - ఫ్రెంచ్ / సంస్కృతం
ఫిబ్రవరి 25వ తేది - సామాజిక శాస్త్రం
ఫిబ్రవరి 28వ తేది - హిందీ కోర్సు A/B
మార్చి 10వ తేది - గణితం
మార్చి 18వ తేది - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ప‌న్నెండో తరగతి పరీక్షల షెడ్యూల్..

2025 ఫిబ్రవరి 15వ తేది - ఫిజికల్ ఎడ్యుకేషన్
ఫిబ్రవరి 21వ తేది - భౌతికశాస్త్రం
ఫిబ్రవరి 22వ తేది - బిజినెస్ స్టడీస్
ఫిబ్రవరి 24 వ తేది - భౌగోళిక శాస్త్రం
ఫిబ్రవరి 27వ తేది - రసాయన శాస్త్రం
మార్చి 8వ తేది - గణితం - స్టాండర్డ్/అప్లైడ్ మ్యాథమెటిక్స్
మార్చి 11వ తేది - ఇంగ్లిష్ ఎలక్టివ్/ఇంగ్లిష్ కోర్
మార్చి 19వ తేది - ఎకనామిక్స్
మార్చి 22వ తేది - పొలిటికల్ సైన్స్
మార్చి 25వ తేది - జీవశాస్త్రం
మార్చి 26 వ తేది - అకౌంటింగ్
ఏప్రిల్ 1వ తేది - చరిత్ర
ఏప్రిల్ 4వ తేది - సైకాలజీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+