అల‌ర్ట్‌.. ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌..

బ్యాంకు ప‌రీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌లయ్యాయి. ఐబీపీఎస్ క్ల‌ర్క్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు మెయిన్స్ ప‌రీక్ష‌ల అడ్మిట్‌కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. తాజాగా ఐబీపిఎస్ క్ల‌ర్క్స్ మెయిన్ అడ్మిట్‌కార్డుల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వంటి వివరాల‌ను ఎంట‌ర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఐబీపీఎస్ ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 13న క్లర్క్స్ మెయిన్ పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ పరీక్షరోజు వరకు అభ్య‌ర్థుల కోసం హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 6128 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.

Alert Release of IBPS Clerk Mains Exam Admit Cards

ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీలో 105 పోస్టులు ఉండ‌గా, తెలంగాణలో 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జ‌రిగాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 13న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్న‌ట్లు అధికారులు తెలిపారు. తాజాగా, మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ విడుదల చేసింది.

ఐబీపీఎస్ క్లర్క్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

అభ్య‌ర్థులు ముందుగా అడ్మిట్ కార్డు కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ హోంపేజీలో కనిపించే 'Online Main Exam Call Letter for CRP-Clerks-XIV' లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఆ లింక్‌పై క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.

వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన హాల్‌టిక్కెట్ డిస్‌ప్లేలో క‌నిపిస్తుంది. అడ్మిట్ కార్డు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోగ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+