AP DSC 2024: ఏపీ డీఎస్సీ, టెట్ షెడ్యూల్ విడుదల-6100 పోస్టులు, ముఖ్యమైన తేదీలివే..

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ షెడ్యూల్ వెలువడింది. రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా కేబినెట్లో ఆమోదించిన ప్రకారం వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అలాగే టెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోనున్నారు.

రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి 8న టెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలలో ని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 12 తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాల వెల్లడితో ముగియనుందన్నారు.

AP DSC 2024 Notification released for 6100 posts, Applications from feb 12- details of posts

రాష్ట్రంలో ఈసారి డీఎస్సీలో భాగంగా భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలను కూడా మంత్రి బొత్స వెల్లడించారు. ఇందులో 2280 ఎస్జీటీ పోస్టులు, 2299 స్కూల్ అసిస్టెంట్ లు, 1264 టీజీటి పోస్టులు, 215 పిజిటి పోస్టులు, 242 ప్రిన్సిపాల్ నియామకం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బొత్స వెల్లడించారు. వీటికి సంబంధించి ఒకే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే అభ్యర్ధులు కేటగిరీల వారీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

డీఎస్సీ కంటే ముందుగా టెట్ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 8న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 18 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకూ వివిధ కేటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మార్చి 14న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఫిబ్రవరి 12న డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లించేందుకు గడువిచ్చారు. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.

డీఎస్సీ పరీక్ష హాల్ టికెట్లు మార్చి 5 నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీ పరీక్షలు ఉదయం, సాయంత్రం సెషన్లలో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 7 న డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తారు. ఈసారి కూడా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే డీఎస్సీ, టెట్ పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్ cse.ap gov.in లో అందుబాటులో ఉంచుతున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళుగా నిర్ణయించారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు. అంటే 49 ఏళ్ల వరకూ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+