AP EAPCET 2024 Hall tickets: ఏపీలో ఎంసెట్ హాల్ టికెట్ల విడుదల- డౌన్ లోడ్ ఇలా..!

ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2024) పరీక్ష హాల్ టికెట్లు ఇవాళ విడుదల చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో భాగంగా వివిధ కేటగిరీల వారీగా పరీక్షలు ఉంటాయి. వీటి కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్ధులకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు.

ఈఏపీసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx ను క్లిక్ చేస్తే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ లింక్ పై క్లిక్ చేయగానే హాల్ టికెట్ల పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ కనిపిస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

AP EAPCET 2024 Hall tickets OUT- here is how to download

ఈ ఏడాది ఈఏపీసెట్ కోసం దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల విద్యార్ధులున్నారు. మే 16 నుంచి 23 వరకూ కేటగిరీల వారీగా పరీక్షలు జరుగుతాయి. మే 16,17 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సులకు, మే 18 నుంచి 23 వరకూ ఇంజనీరింగ్ కోర్సులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదనపు వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+