AP POLYCET 2024 Hall Tickets: ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ల విడుదల-డౌన్ లోడ్ ఇలా..!
ఏపీలో పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ఏటా నిర్వహంచే పాలిసెట్ పరీక్ష హాల్ టికెట్లు ఇవాళ విడుదలయ్యాయి. ఇప్పటికే పాలిసెట్ 2024 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. దీంతో అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లను విడుదల చేస్తున్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్ టికెట్లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలన్న సమాచారం కూడా ఇచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పాలిసెట్ 2024 హాల్ టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://polycetap.nic.in/ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అభ్యర్ధులు వీటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పరీక్షకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఏపీలో పాలిసెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 27న నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్తే హాల్ టికెట్ల డౌన్ లోడ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అడిగిన వివరాలు ఎంటర్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పరీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోనే హెల్ప్ డెస్క్ నంబర్ తో పాటు ఇతర వివరాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications