ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ?

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చురుగ్గా సాగుతోంది. ఇవాళ్టితో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుండగా.. 8వ తేదీతో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తి కాబోతోంది. దీంతో ఫలితాల విడుదలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాళ్టితో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుండటంతో వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియలు పూర్తి చేసి ఈ నెల 12న ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలతో పలు పోటీ పరీక్షలకు లింక్ ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల చేసేందదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ap ssc and intermediate exam results release soon

మరోవైపు ఈ నెల 8న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాకనం ముగియబోతోంది. దీంతో వాటి పునఃపరిశీలన, మార్కులు ఆన్ లైన్లో నమోదు చేసి ఫలితాల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారాల్లో పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి విడుదల తర్వాత తిరిగి సప్లిమెంటరీ, ఇంటర్ అడ్మిషన్లు కూడా ఉంటాయి కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+