AP TET: ఏపీ టెట్ పరీక్షకు ఫిబ్రవరి 1 నుంచి అప్లికేషన్లు-డీఎస్సీకి ఇలా..
ఏపీలో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు నిర్వహించే అర్హత పరీక్ష (టెట్)ను, ఉపాధ్యాయుల ఎంపిక పరీక్ష(డీఎస్సీ)ని వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ రెండు పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం వెల్లడించింది. ఎప్పటిలాగే తొలుత టెట్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం డీఎస్సీ పరీక్ష తేదీని, ఇతర షెడ్యూల్ ను ప్రకటిస్తారు. వీటిపై రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఏపీలో ముందుగా నిర్వహించే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) కోసం ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష నిర్వహణ, ఇతర అంశాలను నిర్ణయిస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే పరీక్ష నిర్వహణకే 15 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. అనంతరం డీఎస్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో టెట్ పరీక్షకు వచ్చే స్పందన ఆధారంగా మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయన్న మాట.

టెట్ పరీక్షను పేపర్ 1, పేపర్ 2లుగా విభజించారు. పేపర్ 1లో ఎస్జీటీలకు, పేపర్ 2ను స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు.టెట్ రాయాలంటే ఎస్జీటీలకు రెండేళ్ల డీఈడీ కోర్సు, స్కూల్ అసిస్టెంట్లకు బీఈడీ కోర్సు అర్హతగా ఉంటాయి. వీటితో పాటు ఎస్జీటీలకు ఓసీలకు ఇంటర్ లో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.
ఈసారి కూడా టెట్, డీఎస్సీ పరీక్షల్ని కంప్యూటర్ పైనే నిర్వహిస్తారు. అలాగే డీఎస్సీలో టెట్ పరీక్షలో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ వెల్లడిస్తారు. దాని ఆధారంగా ఈ ఏడాది 6 వేల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications