ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్: గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల కోసం అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 92 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన కీలక విషయాలు గమనించండి.
అర్హతలు:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ(ఫైర్) ఉత్తీర్ణత ఉండాలి.
వయో పరిమితి:
01/07/2022 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్) పోస్టులకు 21-30 ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్(మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజినల్/డిస్ట్రిక్ట్/డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు పరిమితిగా నిర్ణయించారు.
మిగిలిన వాటికి 18-42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఎంపిక:
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ. 370
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 13, 2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 2, 2022
ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 1, 2022
ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్): డిసెంబర్ 18, 2022
మెయిన్స్: రాత పరీక్ష(డిస్క్రిప్షన్): మార్చి, 2023
గ్రూప్-1 ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్












Click it and Unblock the Notifications