Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CAT 2023: తగ్గుతున్న ఇంజనీరింగ్ జాబ్స్-మేనేజ్మెంట్ కోర్సులకు డిమాండ్! చరిత్ర సృష్టించిన క్యాట్ !

దేశవ్యాప్తంగా ఈ ఏడాది మేనేజ్ మెంట్ కోర్సులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. గతంలో కరోనా కారణంగా రెండేళ్ల పాటు చదువులకు దూరమైన విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా అవగాహన పెంచుకోవడం, కరోనా నుంచి బయట పడి కాలేజీలకు రెగ్యులర్ గా వెళ్తుండటం, అదే సమయంలో దేశంలో ఇంజనీరింగ్ ఉద్యోగాల మార్కెట్ తగ్గుతుండటం మేనేజ్ మెంట్ కోర్సుల డిమాండ్ ను పెంచేస్తున్నాయి. తాజాగా నిర్వహించిన మేనేజ్ మెంట్ కోర్సుల ప్రవేశపరీక్షలను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతోంది.

దేశంలో కరోనా తర్వాత క్రమంగా మారుతున్న పరిస్ధితుల్లో తిరిగి విద్యార్దులు విద్యాసంస్ధలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.దీని ప్రభావంతో ఈ ఏడాది మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. క్యాట్, ఎక్సాట్, మ్యాట్, స్నాప్ ఇలా ఏ మేనేజ్ మెంట్ కోర్సు ప్రవేశ పరీక్ష చూసినా రాసే వారి సంఖ్య పెరిగింది. క్యాట్ అయితే ఏకంగా 3.3 లక్షల దరఖాస్తులతో రికార్డు సృష్టించింది. ఇది కామన్ అడ్మిషన్ టెస్ట్ చరిత్రలో అత్యధికమని క్యాట్ పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ సంజీత్ సింగ్ వెల్లడించారు.

CAT 2023: record spike in management courses registrations due to slash in engineering jobs

అలాగే వచ్చే నెలలో జరిగే జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (XAT) 2023 రిజిస్ట్రేషన్లు కూడా గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగాయి.అటు సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SNAP 2023) కూడా గతేడాదితో పోల్చితే లక్షకు పైగా అదనపు రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకుంది. ఇది గతేడాది కంటే 25 శాతం అధికం. ఇంజనీరింగ్ జాబ్ మార్కెట్ నెమ్మదించడం, పెరిగిన ఆన్ లైన్ కోర్సులతో మేనేజ్ మెంట్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని ఐఐఎం ఇండోర్ డైరెక్టర్ హిమాన్షు రాయ్ చెప్తున్నారు.

మేనేజ్ మెంట్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ వెనుక మరో కారణం కూడా ఉంది. 2021 నుంచి పెరుగుతున్న ఉద్యోగాల లే ఆఫ్ ల కారణంగా తమ స్కిల్స్ పెంచుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తుండటం కూడా దీనికి మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఫ్రెషర్‌లకు ఐటీ, టెక్ కంపెనీలు ఉద్యోగాలిస్తే.. ఈ ఆర్ధిక సంవత్సరంలో మాత్రం 1.55 లక్షల మంది ఫ్రెషర్‌లను నియమించుకునే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+