CBSE Exams: ఇక ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు-ఎప్పటి నుంచో తెలుసా ?

కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లోనూ మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తున్న బోర్డు పరీక్షల్ని ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ)ని కేంద్రం ఆదేశించింది. దీంతో సీబీఎస్ఈ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

2025 నుంచి అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు వీలుగా విద్యావిధానంలో మార్పులు చేయాలని బోర్డును కేంద్రం కోరింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి పీలుగా సీబీఎస్ఈ స్కూళ్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లతో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ, సీబీఎస్ఈ అధికారులు చర్చలు జరపబోతున్నారు. ఇందులో వారికి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు ఎలా నిర్వహించాలో స్పష్టత ఇవ్వనున్నారు.

CBSE exams twice a year from 2025- centre orders board to work out logistics

ప్రస్తుతం, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ షెడ్యూల్‌పై ప్రభావం చూపకుండా మరో సెట్ బోర్డ్ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్‌ను ఎలా రూపొందించాలి అనే పద్ధతులను బోర్డు రూపొందిస్తోంది. బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు ఎలా నిర్వహించాలో లాజిస్టిక్స్‌పై పని చేయాలని మంత్రిత్వ శాఖ సీబీఎస్ఈని కోరింది. ఈ మేరకు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+