సీటెట్ జులై 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
సీటెట్ జులై 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్.. సీబిఎస్ఈ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 7వ తేదిన సీటెట్ జులై 2024 పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్‌కార్డులను సీబిఎస్ఈ తాజాగా విడుదల చేసింది. అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు https://examinationservices.nic.in/ExamSysCTET/downloadAdmitCard/AuthCandCTET.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgHblUzXTXbmlihUdridY8eyaG4crSFYPx1+ZwSJDGT1X ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సీటెట్ అడ్మిట్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగలరు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేయాల్సి ఉంటుంది. సీటెట్ జులై 2024కు సంబంధించి మార్చినెలలో సీబీఎస్‌ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 7వ తేదిన సీటెట్ పరీక్ష జరగనుంది. పెన్ను పేపర్ విధానంలోనే ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

ఏటా రెండుసార్లు..
సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. సీటెట్ జులై 2024 దేశవ్యాప్తంగా 136 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఎన్‌సీటీఈ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో అభ్యర్థి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ప్రైమరీ స్టేజ్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతులకు బోధించేందుకు పేపర్ 1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక, ఎలిమెంటరీ స్టేజ్ అంటే ఆరు నుంచి 8 తరగతి విద్యార్థులకు బోధించేందుకు పేపర్ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications