50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!

అంతర్జాతీయ కన్సల్టింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న 'డెలాయిట్' భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. దేశీయంగా సుమారు 50,000 మంది వృత్తి నిపుణులను నియమించుకునే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సంస్థ దక్షిణాసియా సీఈఓ నితిన్ ప్రకటించారు. కేవలం నియామకాలే కాకుండా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సిబ్బందిలో 'క్రిటికల్ థింకింగ్' మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, డెలాయిట్ ఈ ధోరణిని భిన్నంగా చూస్తోందని నితిన్ స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగులను తొలగించడం కాకుండా, వారి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సాంకేతికతను ఒక సాధనంగా వినియోగిస్తామన్నారు. ఇప్పటికే 30,000 మంది సిబ్బందికి ఏఐలో శిక్షణ పూర్తి చేశామని, మరో 20,000 మందికి త్వరలోనే ఈ నైపుణ్యాలను నేర్పించనున్నట్లు తెలిపారు.

Deloitte to Hire 50 000 Professionals in India Focus on AI Training and Critical Thinking Skills

భారత్‌లో 'క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'

సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది భారత్‌లోనే పనిచేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే దేశంలో ఒక అత్యాధునిక 'క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను నెలకొల్పబోతున్నట్లు నితిన్ వివరించారు. సంస్థ మొత్తం ఆదాయంలో 9 శాతాన్ని కేవలం ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకే వెచ్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తీర్చిదిద్దడమే తమ ప్రధాన అజెండా అని చాటిచెప్పారు.

డేటా భద్రత - సైబర్ సెక్యూరిటీపై నొక్కి..

భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఏఐని స్వీకరించే క్రమంలో డేటా భద్రత మరియు అధిక వ్యయం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నితిన్ విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన సైబర్ భద్రత ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. "అధిక వేగంతో దూసుకెళ్లే ఇంజిన్ కలిగిన కారుకు, అంతే శక్తివంతమైన బ్రేకులు ఎంత ముఖ్యమో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సైబర్ భద్రత కూడా అంతే ముఖ్యం" అని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+